PKఅంటే బాబుకి వ‌ణుకెందుకు? | Why is AP CM Chandrababu Naidu SCARED of Prashant Kishor?

admin
pk

AP CM Chandrababu Naidu is shaken by the 2019 election. It is in his every action. It is evident in every move. 40 years old industry experience Chandrababu is a person who is saying that he is a senior in the country.Click on the below video to know more details of Why is AP CM Chandrababu Naidu SCARED of Prashant Kishor?

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి 2019 ఎన్నిక‌లంటే వ‌ణికిపోతున్నాడు. అది ఆయ‌న ప్ర‌తి చ‌ర్య‌లోనూ. ప్ర‌తి క‌దిలిక‌లోనూ స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది.

40 ఏళ్లే ఇండ‌స్ట్రీ అనుభ‌వం. నేనే దేశంలో సీనియ‌ర్ అని అబ‌ద్దాన్ని తొణ‌క‌కుండా చెప్పుకునే చంద్ర‌బాబు ఓ వ్య‌క్తి అంటే వ‌ణికి పోతున్నారు. ఆయ‌నెవ‌రో మీకు ఇప్ప‌టికే తెలిసి ఉంటుంది. ఆయ‌నే ప్ర‌శాంత్ కిషోర్‌. ఆయ‌న గురించి పెద్ద‌గా చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న‌, వాచ్ చేస్తున్న వారికి ఆయ‌న గురించి బాగానే తెలుసు. ఈయ‌న ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత వైఎస్ జ‌గ‌న్ పార్టీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారనేది తెల్సిందే. అయినంత మాత్ర‌న‌ ఎందుకు అంత‌గా చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నాడు? ఆయ‌న‌లో చంద్ర‌బాబును అంత‌గా భ‌య‌పెట్టే శ‌క్తి ఏముంది? అనే అనుమానాలు రావ‌టం స‌హ‌జం.

నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నాకంటే ఎన్నిక‌ల వ్యూహా క‌ర్త ఎవ‌రుంటారు? అని మాట్లాడారు. బ‌హుశ ప్ర‌శాంత్ కిషోర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటారు. నంద్యాల‌లో ఎలా గెలిచార‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే టీడీపీ 27 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ గెలుపు చంద్ర‌బాబుకి, టీడీపీకి జోష్ నింపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు, నంద్యాల‌, ఆ త‌ర్వాత కాకినాడ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మాది నంద్యాల న‌మూనానే అని అనేక చార్లు ప్ర‌క‌టించారు. నంద్యాల‌లో ఏం జ‌రిగిందో మ‌రోసారి చ‌ర్చిద్దాం. కానీ నంద్యాల‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తొలిసారి ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నాయుడు వైసీపీ పార్టీ గురించి నొచ్చుకున్నారు. చాలా మందికి ఇది అర్దం కాదు. చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ప‌త‌నం కోరుకుంటాడు క‌దా? మ‌రి వైసీపీ ఓ వ్య‌క్తి వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతుంద‌ని, ఎటువంటి లాభం లేద‌ని చెప్పాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అనే చ‌ర్చ మొద‌లైంది.

చంద్ర‌బాబు నిజంగానే వైసీపీకి లాభం జ‌ర‌గాల‌ని కోరుకునే వ్య‌క్తా? కాదు క‌దా? అటువంట‌ప్పుడు ప్ర‌శాంత్ కిషోర్ వ‌ల్ల ఆ పార్టీకి న‌ష్టం త‌ప్పా, లాభం లేద‌ని చెప్పాల్సిన అవ‌స‌రం ఏ వ‌చ్చింది? ఇది చంద్ర‌బాబు నాయుడు వ్యూహాత్మంగా వైసీపీపై ప్లే చేస్తున్న మైండ్ గేమ్‌. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు కార‌ణంగా వైసీపీ నంద్యాల‌లో గెలుస్తోంద‌ని చాలా మంది న‌మ్మారు. పార్టీ ఓడిపోవ‌టంతో ఆ పార్టీలో కూడా ప్ర‌శాంత్ కిషోర్‌పై ఒక‌రిద్ద‌రు కామెంట్ చేశారు. అందుకే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శాంత్ కిషోర్ స‌బ్జెక్టును నంద్యాల‌లో ఓపెన్ చేశారు. నంద్యాల‌లో చంద్ర‌బాబు నాయుడు ఎలా గెలిచారోప్ర‌త్యేకించి చెప్పుకోన‌క్క‌ర లేదు. వైసీపీ ఓడిపోవ‌టానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఆపార్టీ స‌మీక్షించుకుంటుంది. కానీ చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ప్ర‌శాంత్ కిషోర్‌ను టార్గెట్ చేస్తున్నారు. వ‌చ్చే సాధార‌ణ‌ ఎన్నిక‌లు నంద్యాల ఉప ఎన్నిక‌ల మాదిరిగా ఉండ‌వ‌నే సంగ‌తి అంద‌రికంటే చంద్ర‌బాబుకే బాగా తెలుసు. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్‌కు స‌రైన వ్యూహం లేక‌పోవ‌టం వ‌ల్లే ఓట‌మి పాల‌య్యారు. ఇప్పుడు కూడా ఏదో విధంగా ప్ర‌శాంత్ కిషోర్ అనే వ్య‌క్తి వ్యూహ‌క‌ర్త‌గా లేకుండా చేయాల‌నేది చంద్ర‌బాబు వ్యూహంగా క‌న్పిస్తోంది. ఎందుకో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఈ సారి వైసీపీ నేత‌లు మాత్రం చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హారిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడి ఎత్తులు, వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్ప‌డు గ్ర‌హిస్తూ కౌంట‌ర్లు వేస్తున్నారు. దాంతో బాబుకు ప్ర‌శాంత్ కిషోర్ అంటే వ‌ణుకు ప‌ట్టుకుంది. దాన్ని క‌ప్పిపెట్టుకోవ‌టం కోసం ప్ర‌శాంత్‌కిషోర్‌ను టార్గెట్ చేస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , ,