నంద్యాల‌లో అఖిల ప్రియది ఒంట‌రి పోరేనా?

ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న నంద్యాల‌లో అయితే ఈ ప‌రిణామాల వేగం మ‌రింత‌గా ఉంది.


తాజాగా టీడీపీ నంద్యాల ఇన్‌ఛార్జి , మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్న విష‌యం తెల్సిందే. అయితే ఆయ‌న రాజీనామా చేసి ప్ర‌త్య‌ర్ధి పార్టీలో చేరితే నిజానికి టీడీపీలో మంత్రిగా ఉండి. నంద్యాల సీటును త‌న కుటుంబ స‌భ్యుల‌కే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న అఖిల ప్రియ సంతోషించాలి. ఆమె కు సంతోషం ద‌క్క‌క‌పోగా, పార్టీ నుంచి హెచ్చ‌రిక‌లు అందుతున్నాయి. ఇప్పుడు ఇంటా బ‌య‌టా కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే వీడియో సాతం చూడండి.

శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీని వీడ‌టంతో జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేసే ప‌నికి సీఎం చంద్ర‌బాబు పూనుకున్నారు. దానిలో భాగంగా టెలీకాన్పిరెన్స్ నిర్వ‌హించారు. శిల్పా పోవ‌ట వ‌ల్ల జ‌రిగిన‌, జ‌రుగుతున్న న‌ష్టంపై అఖిల ప్రియ నుంచి వివ‌రాలు తీసుకున్నారు. అయితే ఆమె చెప్పిన స‌మాధానంపై చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీ వీడి వెళ్ల‌టానికి అఖిల ప్రియ ఒంటెద్దు పోక‌డే కార‌ణ‌మ‌ని కూడా చంద్ర‌బాబుకు రిపోర్టులు ఉన్నాయి. బ‌హుశా ఈ విష‌యాన్ని శిల్పా మోహ‌న్ రెడ్డి సోద‌రుడు శిల్పా ప్ర‌భాక‌ర్ రెడ్డి చెప్పినా ఆశ్చ‌ర్యం లేదు. శిల్పా మోహ‌న్ రెడ్డి ఎందుకు వెళ్లిపోయార‌ని ప్ర‌శ్నించ‌గా ఆయ‌న ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వెళ్లిపోయార‌ని చంద్ర‌బాబు కు అఖిల ప్రియ చెప్పిన స‌మాధానంపై బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది.
అంతే కాకుండా భూమానాగిరెడ్డి న‌మ్మిన బంటు ఎవీ సుబ్బారెడ్డితో కూడా అఖిల ప్రియ‌కు స‌త్సంబంధాలు లేవ‌ని పార్టీ నేత‌లకు తెలియ‌టంతో ఈ విష‌యంపై అఖిల ప్రియ‌ను నిల‌దీశారు. శిల్పా సంగ‌తి ప‌క్క‌న పెట్టండి. ఏవీ సుబ్బారెడ్డి సంగ‌తి ఏమిట‌ని ప్ర‌శ్నించ‌గా అఖిల ప్రియ స‌మాధానం చెప్ప‌లేక‌పోయింది. దీంతో పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ఎవీ సుబ్బారెడ్డి పార్టీ అనుచ‌రుల‌తో స‌మావేశమ‌య్యారు. త‌న‌తో ఉంటారా? మ‌ంత్రి అఖిల ప్రియ‌తో ఉంటారో తేల్చుకోవాల‌ని అన్న‌ట్లుగా తెలుస్తోంది. ఆయ‌న వైఖ‌రి ప‌రిశీలిస్తే ఆయ‌న అఖిల ప్రియ‌తో క‌లిసి ప‌ని చేసే ప‌రిస్థితి లేద‌ని అర్దం అవుతుంది. ఆయ‌న కూడా వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. నంద్యాల‌లో టీడీపీ పార్టీ స‌హ‌కారంతో గెలిచిన మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌, కౌన్స‌ల‌ర్లు, స‌ర్పంచులు, ఎంపీటీలు,జెడ్పీటీసీలు, ఎంపీపీలు , చివ‌రికి నాగిరెడ్డికి న‌మ్మిన బంటులుగా ఉన్న వాళ్లంద‌రూ కూడా పార్టీ ఖాళీ చేస్తే ఇక మిగిలేది ఎవ‌రూ? అఖిల ప్రియ త‌ప్పా? సో అఖిల ప్రియ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరాటం చేయాల్సి వ‌స్తుందేమో?

Add your comment

Your email address will not be published.