
Meanwhile, the higher the average. The BJP government is all over the country.click on the below video to know more details for Will AP PLAN Elections in 2018?
ఆ మధ్య అదిగో మధ్యంతరం ఇదిగో మధ్యంతరం .. బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు పెడుతోంది అన్నారు .
కానీ కొన్ని నెలల తరవాత అబ్బే అలాంటిది ఏమీ లేదు అన్నారు. మొన్న నంద్యాల ఎలక్షన్ , కాకినాడ ఎలక్షన్ పూర్తి అవ్వడం టీడీపీ బంపర్ మెజారిటీ తో తిరుగులేని శక్తి గా గెలవడం తో మళ్ళీ ఈ మధ్యంతరం వైపు చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్డగోలుగా ప్రజలని విభజించిన తరవాత ఏపీ తీవ్ర సంక్షోభం లో పడిపోయింది అనీ అలాంటి టైం లో ప్రజలు తననే ఎంచుకుని తానే సరైన నాయకుడిని అని నమ్మారు అంటూ చంద్రబాబు తన పార్టీ నేతలతో చెబుతూ అన్నారు. గుంటూరు హ్యాపీ రిసార్ట్ లో తాజాగా టీడీపీ వర్క్ షాప్ నడిచింది ఇక్కడ మాట్లాడిన చంద్రబాబు అన్ని విషయాల గురించీ చర్చిస్తూ ఆఖర్లో ఈ విషయం కూడా చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా 2018 డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నా సిద్ధంగా ఉండాలి అంటూ పార్టీ శ్రేణులకి ఒక రకమైన పాజిటివ్ సందేశం ఇచ్చారు.తమ పార్టీని గెలిపించిన కాకినాడ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మరోమారు స్పష్టంచేశారు. ప్రాంతాలు – కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయనీ – సంక్షోభాన్ని సృష్టించాలని చూసినా ప్రజలు నమ్మలేదన్నారు.అయితే చిన్న ఎన్నికల్లో గెలవగానే చంద్రబాబు పెద్ద ఎన్నికల మీద కాన్ఫిడెంట్ గా మాట్లాడడం , రానున్న రెండో డిసెంబర్ నాటికే సిద్ధంగా ఉండండి అంటూ ఉన్నారు అంటే ముందస్తు ఎన్నికలు వచ్చేసే ఛాన్స్ కనిపిస్తోంది అని రాజకీయ విశ్లేషకుల అంచనా. గతంలో ఒకసారి ముందస్తు పెట్టుకుని ఫెయిల్ అయిన చంద్రబాబు మళ్ళీ ఆ రిస్క్ తీసుకుంటారా ?
Tags : 2018 Elections Latest News, 2018 Elections Latest Updates, Andhara Pradesh 2018 Elections, andhra pradesh, Andhra Pradesh 2018 Elections, AP, Chandrababu, Chandrababu about 2018 Elections, Chandrababu Latest News, Chandrababu to Plan Andhra Pradesh Elections in 2018, Latest Political News, Latest Political Updates, newsmarg, Political News, Political Updates, telugu news, Will AP PLAN Elections in 2018, YS Jagan