హిందూపూర్ లో బాలకృష్ణ పర్యటనను అడ్డుకున్న ప్రజలు! | Will Balakrishna FULFIL Their WISHES

admin
hindu

Tdp mla Balakrishna is doing the role of a Hindu MLA while doing a number of films.click on the below video to know more details of Will Balakrishna FULFIL Their WISHES

ఓ వైపు సినిమాలు చేస్తూనే హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న tdp mla బాలకృష్ణ ఈ మధ్య తరచు వార్తల్లో నిలుస్తున్నారు.

సినిమాల పరంగా బాలయ్య మంచి పేరునే తెచ్చుకున్నా ఇంకా రాజకీయపరంగా ఆయన అంత పేరు సంపాదిన్చుకోలేదన్నది కొందరి వాదన. అయితే రీసెంట్ గానంద్యాల ప్రచారంలో ఓ అభిమానిపై చేయి చేసుకొని తీవ్ర విమర్శలను తెచ్చుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా ఆ విషయంపై స్పందించిన తీరుపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలావుంటే రెండు రోజుల సుడిగాలి పర్యటనకు హిందూపూర్ కు వెళ్ళిన బాలకృష్ణకు చేదు అనుభవాలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఆయనకు ఆయన సొంత నియోజకవర్గంలోనే అయన పనితీరుపై విమర్శలు ఎక్కువైనట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా సాధారణ ప్రజలు ఆయన పనితీరుపై ఏ మాత్రం సానుకూలం గా లేనట్టు కనపడుతోందని విశ్లేషకుల మాట. రీసెంట్ గా ఆయన నియోజకవర్గం లోని సి.వెంకటాపురం, ఓబుళాపురం, గలిబిపల్లి గ్రామాల్లోని ప్రజలు రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉందని బాలకృష్ణ ను అడగలనుకొని ఆయన లేపాక్షి నుంచి గలిబిపల్లి క్రాస్‌కు రాగానే స్థానికులంతా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో బాలయ్య అధికారులతో మాట్లాడి త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. అంత సర్దుకుందిలే అనేలోపే ఆయన వాహనాన్ని మరికొంత మంది అడ్డుకొని రహదారి విషయంపై ఓ క్లారిటీ ఇవ్వాలని కోరారు. కానీ ఈ సారి బాలకృష్ణ వారితో ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ బాలయ్య వారి సమస్యలను తీరుస్తాడో, లేక అలిగి వెళ్ళిపోయాడో తెలియరాలేదు. మరి చూడాలి ఏమి జరగబోతోందో అని ఆ పల్లెల ప్రజలు అనుకుంటున్నారంట.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , ,