చంద్ర‌బాబు “పీపీపీ”ల‌తో ఎన్నిక‌ల్లో నెట్టుకు రాగ‌ల‌రా? | Will Chandrababu Win in 2019 ELECTIONS?

admin
chandrababu

AP CM Chandrababu Naidu is a worker in the media and the media is always blowing.click on the below video to know more details of Will Chandrababu Win in 2019 ELECTIONS?

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌నిమంతుడిగా మీడియాలోని ఓ వ‌ర్గం మీడియా ఎప్పుడూ ఊద‌ర‌గొడుతూ ఉంటుంది.
ఆయ‌న రోజుకి 26 గంట‌ల పాటు ప‌ని చేస్తార‌ని టీడీపీ నేత‌లు మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప‌ని మంతుడైన చంద్ర‌బాబు నాయుడికి త‌న పాల‌న‌పై ఆయ‌న‌కే న‌మ్మ‌కం కుద‌ర‌టం లేదా? ఆ న‌మ్మ‌కం లేక‌నే పీపీపీ వ్యూహాన్ని ఆశ్ర‌యిస్తున్నారా? న‌ంద్యాల‌, కాకినాడ‌ల్లోనూ కూడా ఇదే సూత్రీక‌ర‌ణ అమ‌లు చేశారా? ఆ సూత్రీక‌ర‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా సాధ్యం అవుతుంది? ఈ ప్ర‌శ్న‌ల‌పై లోతుగా చ‌ర్చించికుందాం.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌ల‌పై చాలా క్లార‌టీతో ఉన్నారు. ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఏడాదిలోనే జ‌రుగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నంద్యాల‌, కాకినాడ‌ల్లో పార్టీని గెలిపించ‌టానికి క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు రిసార్ట్స్‌లో ఏ ప్ర‌త్య‌క‌మైన కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంద‌ర్భంగా నేత‌ల‌కు ఎన్నిక‌ల వ్యూహాల‌ను కూడా వివ‌రించారు. కాకినాడ‌, నంద్యాల ఎన్నిక‌లు గెలిచిన సంతోషంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌ది అదే ఫార్ములా అని స్ప‌ష్టం చేశారు. అదే చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల ఫార్ములా, ప‌బ్లిక్ మేనేజ్‌మెంట్‌, పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ , పోల్ మేనేజ్‌మెంట్‌, ఇదే క్లుప్తంగా పీపీపీ ఫార్ములా అంటున్నారు. నంద్యాల కాకినాడ‌ల్లో ఏం జ‌రిగింతో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు, అధికార దుర్వీనియోగం, బ్లాక్ మెయిల్ ప్ర‌చారం. పోలీస్ యంత్రాంగం కూడా ఎన్నిక‌ల్లో గెలుపుకోసం ప‌ని చేయ‌టం లాంటి ఎన్నోంటినో చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌టానికి ఏ రేంజ్ లో వాడారు. ఇప్పుడు అదే మా మార్గం అంటున్నారు.చంద్ర‌బాబు నాయుడు ఫార్ముల అమ‌లు చేసుకోవ‌టానికి టీడీపీ అధికారంలో ఉంది కాబ‌ట్టి అది సాధ్యం అయిందని వేరే చెప్పుకోన‌క్క‌ర లేదు. కానీ వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు సీఎం సీటులో ఉన్నా, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యాలే అమ‌లు జ‌రుగుతాయి. అయితే టీడీపీకి అనుకూలంగా ఉండే వాళ్లు ఎవ‌రైనా ఉంటే వాళ్లు లోపాయికారిగా సానుకూలంగా వ్య‌హారించే అవ‌కాశం ఉంది. అయితే ఇది అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సాధ్యం కాదు.

చంద్ర‌బాబుకు త‌న పాల‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని విప‌క్ష వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చంద్ర‌బాబుపై తీవ్ర‌మైన విమ‌ర్శ చేశారు. ఆయ‌న లాజిక్ ప్ర‌కారం చంద్ర‌బాబు పాల‌న‌పై న‌మ్మ‌కం ఉంటే ఈ పీపీపీ ఎందుకు? అనేది ఆయ‌న ప్ర‌శ్న‌. పాల‌న‌పై న‌మ్మ‌కం లేదు కాబ‌ట్టే పీపీపీల ఆధార‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే దీంట్లో నిజం లేదా? ఇవి పూర్తిగా రాజ‌కీయ ఆరోప‌ణ‌లేనా?

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు గ‌తంలో సీఎం ప‌ని చేసిన అనుభ‌వంతోనే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచార‌నేది అంద‌రూ అంగీక‌రించేదే. అయితే ఇప్పుడు త‌న అనుభ‌వంతో ఆయ‌న‌కు గురి కుద‌ర‌టం లేదు. కాబ‌ట్టి ప‌బ్లిక్‌ను మేనేజ్ చేయాల‌ని త‌ల‌పెట్టారు. ప‌బ్లిక్ మేనేజ్‌మెంట్ అంటే పాల‌న ద్వారా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌టం కాదు. మేనేజ్ మెంట్ చేయ‌టం అంటేనే వాళ్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌టం లేదా డ‌బ్బులు ఇచ్చి కొనుగోలు చేయ‌టం, చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూకుమ్మ‌డిగా ప్ర‌జ‌ల్ని కొనుగోలు చేసే కార్య‌క్ర‌మాన్ని ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారన్న మాట‌, ఇక పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ అంటే బీజేపీతో పొత్తు కొన‌సాగుతునే ఉంది. ఇక మిగిలింది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు డైరెక్ష‌న్ ప్ర‌కార‌మే న‌డుస్తున్నాడు. కాబ‌ట్టి జ‌న‌సేన చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ప‌ని చేస్తే ఆశ్చ‌ర్య‌పోయేది ఏమీ లేదు. ఇక పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌ధానంగా ఓట‌ర్ల లిస్టుల్లో టీడీపీ వారి సంఖ్య‌ను పెంచ‌ట‌మే కాకుండా ప్ర‌త్య‌ర్ది పార్టీల ఓట్ల‌ను త‌గ్గించ‌టం, ఇటీవ‌ల క‌డ‌ప జిల్లాలో ఓ వ‌ర్గం వారి ఓట్ల‌ను తొల‌గించార‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేసిన‌ట్లుగా వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇలా చేయ‌టంతో పాటు పోలింగ్ బూత్ స్ధాయిలో ఓట‌ర్ల‌ను మేనేజ్ చేసే ప‌ని కూడా పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఉంటుంది. ప్ర‌జ‌ల్ని తొలి ద‌శ‌లో మేనేజ్ చేసిన త‌ర్వాత కూడా తుది ద‌శలో పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో మేనేజ్ చేస్తార‌న్న మాట‌. ఇలా చంద్ర‌బాబు త‌న గెలుపుకోసం పీపీపీ ని అమ‌లు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్లుగానే చంద్ర‌బాబు నాయుడు అధికారం కి వ‌చ్చిన నాటి నుంచి ఏపీలో అవినీతి విచ్చ‌ల విడిగా పెరిగింది. చంద్ర‌బాబు నోరు జారి మాట్లాడిన‌ట్లుగానే దేశంలో ఏపీని అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని చెప్పిన‌ట్లుగా చేసేశారు. బ‌హుశా ఈ విచ్చ‌ల విడి అవినీతి పీపుల్ మేనేజ్‌మెంట్ కోస‌మేనేమో?

Tags : , , , , , , , , , , , , , , , , ,