కమల్ తో నగ్మా రాయబారం ఫలిస్తుందా? |Will Kamal Haasan JOIN Hands With NAGMA? | Tamilnadu Politics

After the death of Purchchi Thalivi and Tamil Nadu former CM Jayalalitha, their party was not able to come to the end.click on the below video to know more details of

పురచ్చి తలైవి , తమిలనాడు మాజీ cm జయలలిత మరణానంతరం వారి పార్టీ పరిస్తితి దారి తెన్నూ లేకుండా పోయింది.

ప్రస్తుతానికి ఆ పార్టీ నే అధికారం లో వున్నా వారి భవిష్యత్ మాత్రం అగమ్యగోచరం గా వుంది. అసలు తమిళనాడు రాజకీయాలే ఎవ్వరికి అర్థం కాకుండా మారిపోయాయి. ఇక సూపర్ స్టార్ రజని కాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో వైపు జాతీయ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్దమయ్యాదని వినిపిస్తోంది.. అయితే అయన బిజెపి లోకి వస్తాడన్న వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా కేరళ సీఎం తో సమావేశమైనప్పుడు కాషాయ పార్టీ లోకి రానని స్పష్టం చేయడంతో ఇతర పార్టీలు కమల్ ను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ఇందులో ముక్యంగా కాంగ్రెస్ పార్టీ కమల్ ను తమ పార్టీలోకి లాగడానికి కాస్త గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే కమల్ తో రాయబారానికి మాజీ హీరోయిన్ నగ్మాను రంగంలోకి దింపింది. సౌత్ లో మరీ ముక్యంగా తమిళనాడులో నగ్మా అంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికి తెలుసు. వేరే వాళ్లతో చర్చలు పెద్దగా వర్కవుట్ కావని భావించిన వాళ్ళు .. నగ్మా అయితే చర్చలు వర్కవుట్ అవుతాయని కాంగ్రెస్ హై కమాండ్ బావించినట్టుంది .. అందుకే ఆమెను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమిళనాడు కు కమల్ ని కాంగ్రెస్ పగ్గాలు అందించాలని ఆ పార్టీ భావిస్తోందట. మరి ఆంధ్రా లో తమ పార్టీలో మెగాస్టార్ ని పెట్టుకున్నా కూడా లాభం లేదు .. ఇప్పుడు మరో హీరోపై ఆ పార్టీ ఫోకస్ చేయడం విశేషం.

Add your comment

Your email address will not be published.