శిల్పా బాట‌లోనే త‌మ్ముడు!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి వ‌ర‌సగా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.


నంద్యాల‌లో ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌గా ఉన్న చంద్ర‌బాబు ఎత్తులు వేస్తుంటే, వైసీపీ దీనికి పై ఎత్తులు వేస్తోంది. దాంతో నంద్యాల‌లో టీడీపీ వ్య‌వ‌హారం బెడిసి కొడుతుంది.

నంద్యాల టీడీపీ ఇన్‌ఛార్జి శిల్పా మోహ‌న రెడ్డి ఇటీవ‌ల జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన సంగ‌తి తెల్సిందే. దానితో టీడీపీకి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌టానికి చంద్ర‌బాబు క‌ర‌స‌ర్తు మొద‌లు పెట్టి, కాయ‌క‌ల్ప చికిత్స చేశారు. అప్ప‌టి వ‌ర‌కు జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డిని త‌ప్పించారు. కొత్త జిల్లా అధ్య‌క్షుడిని ఎంపిక చేశారు .ఇవ‌న్నీ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పార్టీని త‌ప్ప‌ని స‌రిగా గెలిపించుకోవ‌టానికే న‌నేది స్ప‌ష్టం. అయితే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి జిల్లా బాధ్య‌త‌ల్లో ఉంటే ఏం జ‌రుగుతుందో అనే అనుమానంతో చంద్ర‌బాబు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారంటున్నారు. అంతే కాకుండా ఆయ‌న్ని శిల్పా మోహ‌న్ రెడ్డి కోవ‌ర్ట్‌గా టీడీపీ శ్రేణులు చూస్తున్నార‌ట‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ట్లుగా నంద్యాల కు వెళ్తున్నారు. ఆయ‌న జిల్లా పార్టీ నేత‌ల‌తో భేటీ కానున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌లకు సంబందించిన విష‌యాల‌పై పార్టీ శ్రేణుల‌తో మాట్లాడి వారికి త‌గిన డైర‌క్ష‌న్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. కానీ చంద్ర‌బాబు టూర్ కు సంబంధించిన ఎటువంటి స‌మాచారం కూడా చ‌క్ర‌పాణి రెడ్డికి ఇవ్వ‌లేద‌ట‌, ఎందుకంటే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి సొంత బ‌లం లేద‌నే అభిప్రాయం చంద్ర‌బాబుకి ఉంద‌ట‌. అంతే కాకుండా మీటింగ్ విష‌యాలు ప్ర‌త్య‌ర్దికి చేర‌తాయ‌నే ఉద్దేశంతోనే ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టార‌ట‌. కొంద‌రు నేత‌లు అనుమాన‌పు మాట‌లాడుతున్నార‌ట‌. దీంతో మ‌న‌స్ధాతం చెందిన శిల్పా మోహ‌న్ రెడ్డి అన్న‌య్య బాట‌లో న‌డ‌వ‌టానికి సిద్ద‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. పార్టీలో వ‌ర‌స‌గా జ‌రుగుతున్న అవ‌మానాల‌ను త‌ట్టుకోవ‌టం నా వ‌ల్ల కాద‌ని అన్న‌ట్లుగా తెలుస్తోంది. టీడీపీ నేత‌ల వైఖ‌రి ఇలానే ఉంటే ఆయ‌న కూడా శిల్పా మోహ‌న్ రెడ్డి బాట ప‌ట్టే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ మాత్రం ఎంజాయ్ చేస్తోంది.

Add your comment

Your email address will not be published.