మ‌ళ్లీ కాపు ఉద్య‌మ టెన్ష‌న్ మొద‌లు!!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మ‌రో స‌మ‌స్య తోడైంది. గ‌త కొంత కాలంలో చంద్ర‌బాబుకు చిరాకు తెప్పిస్తున్న స‌మ‌స్య‌ల్లో కాపు సామ‌జిక వ‌ర్గాన్ని బీసీలో చేర్చే అంశం ఒక‌టి.


ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గ‌త ఏడాది కాలంగా ఈ స‌మ‌స్య‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై పోరాడుతున్నారు. దాంతో ఏపీ ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ‌ను టార్గెట్ చేసింది. వివిధ సంద‌ర్బాల్లో ఆయ‌న్ని ఉద్య‌మం చేప‌ట్టిన‌ప్పుడుడ‌ల్లా గృహ నిర్బందం చేయ‌ట‌మో, లేదా అరెస్టు చేయ‌ట‌మో చేశారు. ఇప్పుడు ఆయ‌న కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ బీసీల్లో చేర్చాల‌ని గ‌త ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీని అమ‌లు చేమాల‌ని ఉద్య‌మిస్తున్నారు. ప్ర‌భుత్వం మాత్రం తాము కాపు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌టానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతుంది.

గ‌త‌ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించ‌టంలో కాపు సామాజిక వ‌ర్గం కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెల్సిందే. దీంతో కాపులు రిజ‌ర్వేష‌న్లు కోసం ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ప్పుడల్లా ప్ర‌భుత్వం క‌ఠిన వైక‌రి ప్ర‌ద‌ర్శిస్తోంది.
కాపు ఉద్య‌మంలో తాజాగా ఏపీ హోమంత్రి స్పంద‌న చూస్తే ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో అర్దం అవుతుంది.
ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వబోమని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ విషయాన్ని ప్రకటించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వబోమని, ఈ యాత్రలో ఎవరూ పాల్గొనవద్దని ఆయన అన్నారు.పాదయాత్రలో పాల్గొని ఇబ్బంది పడవద్దని కూడా యువతను కోరుతున్నాని అన్నారు. కాపులను బిసిలలో చేర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన అన్నారు.కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ నెలలో ముద్రగడ చలో అమరావతి పాదయాత్రను చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ప్ర‌భుత్వ వైఖ‌రిని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు. శాంతి యుతంగా పాద‌యాత్ర చేప‌డుతుంటే కూడా అనుమ‌తి నిరాక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ప్ర‌భుత్వం నిరంకుశ‌త్వానికి నిద‌ర్శ‌నం అంటున్నారు. ప్ర‌భుత్వం మాత్రం ఇదే వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన గుణ పాఠం నేర్ప‌టం ఖామ‌న ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. గ‌తంలో లాగే ఇప్పుడు కూడా కాపు ఉద్య‌మం ర‌చ్చ ర‌చ్చ కావ‌టం ఖాయ‌మంటున్నారు.

Add your comment

Your email address will not be published.