పీకే గాలితీసేసిన వైసీపీ నేత వాసిరెడ్డి ప‌ద్మ‌|YCP Leader Vasireddy Padma Comments On PK

ప్ర‌శాంత్ కిశోర్ ఒక‌ప్పుడు ఉత్త‌రాధి రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపిన నేత‌.

ఆయ‌న నాడీ ప‌ట్టుకుంటే చాలు ఫ‌లితం ఎలా ఉంటుందో చెప్పేంత నిపుణుడు అంటూ తెగ ఆకాశానికి ఎత్తారు. అతి చిన్న వ‌య‌స్సులోనే త‌ల‌లు పండిన రాజ‌కీయ కుర‌వృద్దుల‌కు సైతం అంద‌న‌టువంటి వ్యూహాన్ని ఆయ‌న అమ‌లు చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు, త‌రువాత బీహార్, ఆ త‌రువాత పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆయ‌న బ‌లం ఏంటో నిరూపించారు. మ‌న‌కు ద‌క్క‌కుండా పోతున్న ఓటు బ్యాంకును తీసుకురావ‌డంలో ఆయ‌న దిట్ట అని తేలింది. ఇవ‌న్ని నిషితంగా గ‌మ‌నిస్తూ వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌కు ఆయ‌న స‌హ‌యం కావాని కోరారు. అనుకున్న‌ట్లుగానే వ్యూహ‌క‌ర్త‌గా ఉండేందుకు ఒప్పుకున్నారు. సాంపిల్ గా నంద్యాల, ఎన్నిక‌ను తీసుకున్నారు. ఫ‌లితం ఎలా ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌జ‌ల నాడి తెలుసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నించి జ‌గ‌న్ కు వ్యూహ‌పాఠాలు బోధించారు.

అంతా ప్ర‌శాంత్ కిశోర్ క‌నుస‌న్న‌ల్లో నంద్యాల ప్ర‌చారం సాగింద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించ‌డం ద్వారా పీకే తానేమిటో రుజువు చేసుకోవాల‌ని భావించాడు. అందుకే నిత్యం ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ పేరు నానేలాగా ఉండాల‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో జ‌గ‌న్ రెచ్చిపోయి సీఎంను కాల్చి చంపాలి. చొక్కా విప్పాలి. వంటి వ్యాఖ్య‌లు చేశాడు. ఫ‌లితంగా.. ఆశించిన ఫ‌లితం రివ‌ర్స్ అయింది. దీంతో జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేర‌క‌పోగా పీకే వ్యూహం బెడిసి కొట్టింది. అయినా కూడా వైసీపీలో పీకేపై సానుభూతి త‌గ్గ‌లేదు. భూమ‌న, అంబ‌టి వంటి నేత‌లు పీకేని వెనుకేసుకు వ‌స్తూనే ఉన్నారు.నంద్యాల ఫ‌లితం సెంటిమెంట్ మాత్ర‌మే అది వ్యూహానికి ప‌నికి రాదు అంటూ చెప్పారు. అయితే వైసీపీ నేత‌లు బ‌య‌ట‌కు అలా మాట్లాడుతున్నా లోలోప‌ల ఆయ‌న‌పై ఆందోళ‌ణ చెందుతున్నార‌ట‌. నిజంగా ఆయ‌న ఏపీ ప్ర‌జ‌ల నాడి తెలుసుకొని 2019లో జ‌గ‌న్ ను సీఎం చేస్తారా అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. వీటికి బ‌లం చేకూరే విధంగా వైసీపీ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ళ‌నం అయ్యాయి. వైసీపీకి చెందిన మీడియా వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌.. తాజాగా పీకేని ఏకిపారేసింది. శుక్ర‌వారం సాక్షి టీవీలో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వాసిరెడ్డి.. “నంద్యాల ఫలితాలు, ప్రశాంత్ కిషోర్ కి చెంపపెట్టు లాంటివి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్క‌సారిగా లైవ్ షో.. ఉలిక్కి ప‌డింది. అదేంటి కేఎస్ ఆర్ స‌రి చేసే య‌త్నం చేశారు. కాని ఆమె మ‌నుసులో ఉన్నది, పార్టీలో వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అద్దం ప‌ట్టేలా మొత్తం చెప్పేశారు. దీంతో పార్టీ నేత‌లు అక్క‌డి సిబ్బంది కూడా ఉలిక్కి ప‌డ్డారు. దీంతో ఇత‌ర పార్టీల వారు కూడా జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు పీకే పై పెద్ద‌గా న‌మ్మ‌కం లేదంటూ ఎద్దేవా చేయ‌డం ప్రారంభించారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై కొద్ది సేప‌టికి తేరుకుందో ఏమో వాసిరెడ్డి ప‌ద్మ మ‌ళ్లీ కొంత అనుకూల వ్యాఖ్య‌లు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ కి వెళ్ళిపోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా దీనిపై స్పంద‌న ఏంట‌ని కేఎస్ ఆర్ ప్ర‌శ్నించ‌గా దానికి మాత్రం ఆమె మ‌రోలా స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఆయన 2019 కి వైసిపికి వ్యూహకర్త గా ఉంటారనీ అంటూ, ఆయన వ్యూహలు మత్రం సరిచేసుకోవాలని హితవు చెప్పారు. దీంతో వైసీపీ నేత‌ల్లో పీకే వ్యూహంపై కొంత అభ్యంత‌రాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే ఈ ఎన్నిక ఫ‌లితాన్ని కూడా టెస్ట్ క‌ట్ గా వాడింది కూడా అందుకే అయి ఉంటుంద‌ని ఆయ‌న‌కు ఇంకా ఇక్క‌డి రాజ‌కీయాలు పూర్తిగా తెలియ‌వు, ప్ర‌జ‌ల మ‌న‌స్త‌త్వం అర్థం కాదు కాబ‌ట్టి దీని ద్వారా ఒక అంచ‌నాకు రావాల‌నే ఒక పాచిక వేసి ఉంటారని అంటున్నారు. 2019 నాటికి వ్యూహం ఎలా ఉన్న‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు మాత్రం ఇప్పుడే తొంద‌ర‌ప‌డి, వెంట‌నే గెలిచేయ్యాల‌న్న ఆత్రంలో పీకేపై అంతృప్తిని వెల్ల‌గక్కుతున్నారు. ఇది ఆ పార్టీకే న‌ష్టం తీసుకువ‌స్తుంద‌ని రాజ‌కీయ పండితులు హిత‌వు చెబుతున్నారు. ఏది ఏమైన ప్ప‌టికీ నేత‌ల మాట‌ల తీరును జ‌గ‌న్ క‌ట్ట‌డి చేస్తారా..? లేక వారిలాగే ఆలోచిస్తారో చూడాలి..?

Add your comment

Your email address will not be published.