వైసీపీ ఫ్యామిలీతో స్పీడ్‌ పెరిగిన ఫ్యాన్‌ | YCP Leaders happy With YSR Kutumbam Success

admin
ycp

The party has increased the speed of VCP fan as the party is getting ready for the general election next year. By-elections The results of the election results of Kakinada Municipal Corporation have come as some relief to the ranks of the CPC, which has come to favor with the TDP. Click on the below video to know more details of YCP Leaders happy With YSR Kutumbam Success

వ‌చ్చే ఏడాదే సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తాయ‌ని పార్టీల‌న్నీ స‌న్న‌ద్దం అవుతున్న వేళ వైసీపీ ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. నంద్యాల ఉప ఎన్నిక‌లు. కాకినాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికార టీడీపీకి అనుకూలంగా రావ‌టంతో కొంత ఢీలా ప‌డిన వైసీపీ శ్రేణుల‌కు కొంత ఊర‌ట ల‌భిస్తున్న‌ట్లు అయింది. నంద్యాల‌, కాకినాడ‌ల్లో టీడీపీ గెల‌వ‌టంతో ఇక మాది నంద్యాల మార్గ‌మేన‌ని చెప్పి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఊద‌ర‌గొడున్న త‌రుణంలో వైఎస్ ఆర్ ఫ్యామిలీ లో చేరండి అనే కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌కు వైసీపీ నేత‌ల‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింద‌నే చెప్పాలి.

ఈ నెల ఆ పార్టీ అధ్య క్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం 11 రోజ‌ల రిపోర్టును ప‌రిశీలించిన నేత‌ల‌కు ఆశ్చ‌ర్య‌పోయే విధ‌మైన విష‌యాలు తెలిశాయి. గ‌త 11 రోజుల్లో 38 ల‌క్ష‌ల మంది వైఎస్ ఆర్ కుటుంబంలో స‌భ్యుల‌గా చేరార‌నే విష‌యాన్ని నేత‌లు విని సంతోషానికి అవ‌ద‌లు లేవు. ప్ర‌జ‌ల నుంచి ఇంత ఆద‌ర‌ణ ద‌క్కిన ఏకైక పార్టీ వైసీపీయేన‌ని నేత‌లు చెప్పుకుంటున్నారు. లండ‌న్ టూర్ త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ తిరిగి వ‌చ్చి పార్టీ నేత‌ల‌కు ఇచ్చిన టాస్క్‌పై సీనియ‌ర్ నేత‌ల‌తో ముచ్చ‌టించారు. ఆ సంద‌ర్భంగా 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వ‌చ్చిన నివేదిక‌ల‌ను వైఎస్ జ‌గ‌న్‌కు నేత‌లు రిపోర్టు చేశారు. వీటిని ప‌రిశీలించిన వైఎస్ జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల‌కు స్పంద‌న‌కు ఖుషీ అయ్యాడ‌ని అంటున్నారు.

ఇదే కృష్టి ఇలా కొన‌సాగిస్తే పార్టీ నేత‌లు నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌టం పెద్ద క‌ష్టమేమీ కాద‌ని సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. అక్టోబ‌రు 2వ తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఇచ్చిన సంగ‌తి తెల్సిందే. అదే నెల‌లో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద యాత్ర‌ను చేప‌ట్టాల్సింది ఉంది. దాంతో వైఎస్ ఆర్ కుటుంబ స‌భ్యుల సంఖ్య కోటికి చేరుకోవ‌టం ఖాయ‌మ‌ని నేత‌లు అంచ‌న వేస్తున్నారు. ఏమైనా ఇప్పుడు వైఎస్ ఆర్ ఆర్ ఫ్యామిలీకి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ మాత్రం వైసీపీ నేత‌ల్లో పెద్ద జోష్ నింపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ స్టోరీ మీకు న‌చ్చితే షేర్ లేదా లైక్ చేయండి. విభేదిస్తే కామెంట్ చేయండి. మేము రాసి ప్ర‌తీ స్టోరీపైన మీ స్పంద‌న తెలియ చేసి మా చాన‌ల్‌లో భాగ‌స్వాములు కండి.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,