హై కోర్టు కాదు సుప్రీం కోర్టు కి వెళ్లి గెలవాలని జగన్ ప్లాన్ !! |YS Jagan to Approach SUPREME Court

admin
highcourt

There is no doubt that Jagan has approached the court seeking this exemption in the wake of the October festive season.click on the below video to know more details of YS Jagan to Approach SUPREME Court

అక్టోబ‌ర్ నెల‌లో పాద‌యాత్ర చేప‌ట్ట‌బోతున్న నేప‌థ్యంలోనే ఈ మిన‌హాయింపు కోరుతూ జ‌గ‌న్ కోర్టును ఆశ్ర‌యించార‌న‌డంలో సందేహం లేదు.

అయితే, కోర్టు ఈ ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చ‌డంతో… పాద‌యాత్ర ఎలా చేయాల‌నేది ఇప్పుడు వైకాపాలో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇడుపుల‌పాయ నుంచి ఇచ్చాపురం వ‌ర‌కూ పాద‌యాత్ర అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు క‌ల‌గ‌లుపుతూ న‌డుస్తా అన్నారు. కానీ, కోర్టు ఆదేశాల ప్ర‌కారం ప్ర‌తీ శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. అంటే, పాద‌యాత్ర మొద‌లుపెట్టినా కూడా.. శుక్ర‌వారం నాడు ఎక్క‌డుంటే, అక్క‌డి నుంచి హైద‌రాబాద్ రావాల్సి ఉంటుంది. విచార‌ణ పూర్త‌య్యాక‌.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌ను కొన‌సాగించుకోవ‌చ్చు! ఈ లెక్క‌న పాద‌యాత్ర‌కు ప్ర‌తీ శుక్ర‌వారం బ్రేక్ ఇవ్వాల్సి వ‌స్తుంది. నిజానికి, అలా బ్రేకులు ఇస్తూ… మ‌ధ్య‌లో హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్తూ పాద‌యాత్ర చేయ‌డం అనేది కాస్త ఇబ్బందిక‌ర‌మైన వ్య‌వ‌హార‌మే! వేరే గ‌త్యంత‌రం లేద‌ని ఇదే ప‌ద్ధ‌తిలో పాద‌యాత్ర చేద్దామ‌నుకున్నా… దాని ప్ర‌భావం మ‌రోలా ఉంటుంది.

అన్నిటికీమించి తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ఆస్కారం ఇచ్చిన‌ట్ట‌వుతుంది. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఈ పాదయాత్ర ని ఎలా మ్యానేజ్ చెయ్యాలి అని తర్జన భర్జన పడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు వైకాపా లో లాయర్ లు అందరూ ఇదే విషయం మీద డిస్కషన్ లు పెట్టారు. ఏరకంగా ప్రొసీడ్ అయినా సరే పాదయాత్ర జరిగి తీరాల్సిందే అనీ లేదంటే భవిష్యత్తు లో అధికారం అనేది కల్ల లాంటిదే అని చెబుతున్నారు. పైగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు భారీ పాదయాత్ర చేపట్టాలి అన్నా కూడా జగన్ మోహన్ రెడ్డి కి ఈ కేసు ఇబ్బంది ఉండనే ఉంది. సో ఈ సారి సుప్రీం సైడ్ నుంచి ట్రై చేద్దాం అనేది జగన్ ప్లాన్ అట. అయితే, విచార‌ణ‌కు హాజ‌రు కాలేనంటూ జ‌గ‌న్ చూపిస్తున్న‌ది ఓ రాజ‌కీయ కార‌ణం. పైగా, జ‌గ‌న్ ఎదుర్కొంటున్న ఆర్థిక నేరారోప‌ణ‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కూడా ప్రభావం చూపేవిగా ఉన్నాయంటూ న్యాయ‌వాదులే చాలా సంద‌ర్భాల్లో అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో సుప్రీంను ఆశ్ర‌యించ‌డం స‌రైన ప‌ద్ధ‌తా కాదా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. సుప్రీం కి వెళ్లి అక్కడ కూడా నో అనే సమాధానం వస్తే గనక శుక్రవారం కి కోర్టుకి వచ్చేలా పాదయాత్ర మ్యాప్ ప్లాన్ చేస్తారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,