ఏపీ కేంద్రంగా జ‌గ‌న్ కార్యాచ‌ర‌ణ షురూ | YS Jagan To Start His Plannings From Vijayawada

admin
ap

AP opposition leader YS Jagan succeeded in returning to London Tour successfully. YSR Congress ranks in the state when Jagan went to the state to join her in the London School of Economics, where her daughter got a seat in the London School of Economics. Click on the below video to know more details of YS Jagan To Start His Plannings From Vijayawada

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ లండ‌న్ టూర్‌ను విజ‌య‌వంతంగా ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు.

త‌న కుమార్తె వ‌ర్ష ప్ర‌పంచ ప్ర‌స‌ద్ద లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో సీటు సాధించిన నేప‌థ్యంలో ఆమెను చేర్చేందుకు వెళ్లిన జ‌గ‌న్ రాష్ట్రంలో అడుగు పెట్ట‌డంతో వైసీపీ పార్టీ శ్రేణులు ఉత్స‌హం క‌న్పిస్తోంది. గ‌త ప‌ది రోజులు పాటు రాష్ట్రానికి దూరంగా ఉన్నా, జ‌గ‌న్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను తెలుసుకుంటూనే ఉన్నారు. వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన వైఎస్ ఫ్యామిలీకి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌పై నివేదిక‌ల‌ను ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూనే ఉన్నార‌ని తెలుస్తోంది.

వ‌చ్చే నెల 27వ తేదీ నుంచి పాద‌యాత్రం మొద‌లు కావాల్సి ఉన్న నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌ధానంగా జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెట్టే నాటికే ఏపీలో పార్టీ కార్యాల‌యంలో పాటు జ‌గ‌న్ నివాసం కూడా అక్క‌డ ఏర్ప‌డేట‌ట్టు చేసుకోవాల‌ని గ‌తంలో నిర్ణ‌యం తీసుకున్నారు. స్థ‌లం కూడా ఫైన‌ల్ చేశారు. దీనిపై కూడా జ‌గ‌న్ దృష్టి పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక నుంచి వైఎస్ జ‌గ‌న్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అంతా ఏపీ కేంద్రంగా సాగాల‌ని పార్టీ సీరియ‌స్‌గా ఆలోచ‌న చేస్తోంది. కాబ‌ట్టి జ‌గ‌న్ మ‌కాం విజ‌య‌వాడ‌కి త్వ‌ర‌లోనే షిప్ట్ అవుతుంద‌ని పార్టీ నేత‌లు అంటున్నారు.

అలాగే వ‌చ్చె నెలో మొద‌ల‌య్యే పాద‌యాత్ర‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు కూడా పూర్తి చేసి దానికి రూట్ మ్యాప్‌ను ఫైన‌ల్ చేస్తార‌ని అంటున్నారు. టీడీపీ ప్ర‌జా వ్య‌తిరేక పాలన‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టి. ప్ర‌జ‌ల్లోకి న‌వ‌ర‌త్నాల హామీల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా జ‌న‌గ్ ఆ పాద‌యాత్రంలో ప్ర‌చారం చేయాల‌ని త‌ల పెట్టిన విష‌యం తెల్సిందే. ఈ పాద యాత్ర కూడా టీడీపీ బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల మీదిగా సాగాల‌ని రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అక్టోబ‌రు 2వ తేదీ నాటికి వైఎస్ ఫ్యామిలీ కార్య‌క్ర‌మం ముగియ నున్న‌డంతో నియోజ‌క వ‌ర్గాల ఇన్‌ఛార్జీలు, ఎమ్మెల్యేల‌తో కూడా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడ‌తార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏపీలో ఈ ప‌ది రోజులు రాజ‌కీయ వాతావ‌ర‌ణ డ‌ల్‌గా అన్పించింది. జ‌గ‌న్ రాక‌తో మ‌ళ్లీ ఏపీలో రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు ఊపందుకుంటాయ‌ని భావిస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , ,