
YSR Congress chief YS Jagan, who is targeting the 2019 elections, will take stringent decisions? Prasad Kishore has suggested that after Jagan’s step in the direction of Nandivala, after the selection of Nandis, the final stage of the political game played so far is that the final should be final. Click on the below video to know more details of YS Jagan UPSETS his FAMILY Members?
2019 ఎన్నికలనే లక్ష్యంగా చేసుకున్న వైసీపీ అధినేత జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారా..?తన మన బేధం లేకుండా పార్టీలో పూర్తి ప్రక్షాలన చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. నంద్యాల ఎన్నిక తరువాత జగన్ ఎలాంటి స్టెప్ వేయాలో ప్రశాంత్ కిశోర్ పక్కగా సూచించారట.. ఇక ఇప్పటి వరకు ఆడిన పొలిటికల్ గేమ్ లో ఫైనల్ స్టేజ్ కు చేరామని ఇక దూకుడుగా ఫైనల్ కు రెడీ కావాల్సిందే అని చెప్పారట.
అందుకు అనుగుణంగానే జగన్ కూడా స్కెచ్ లు వేస్తూ నేతలకు గట్టిగానే వార్నింగ్ లు ఇస్తున్నారట. ఈ క్రమంలో సొంత బాబాయ్ కి కూడా జగన్ పక్కనపెట్టేందుకు రెడీ అవుతున్నారట..అయితే జగన్ తీసుకునే ఇలాంటి సంచళన నిర్ణయాలతో పార్టీలోని సభ్యులు అసహనానికి గురువుతున్నారని సమాచారం.. లోటస్ పాండు లో ఏమి చేయాలో తోచడం లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.. కొంతమంది జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏదో కొత్త వ్యూహం వేస్తున్నట్లు చెప్తున్నారు… ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎక్కడ ఉంచకూడదో ఇలా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.. కానీ జగన్ తీసుకునే నిర్ణయాలకు కొందరు మాత్రం షాక్ అవ్వక తప్పడం లేదు..తాజాగా తన సొంత వాళ్ళ మీద ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డిమీద ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఆ నిర్ణయం వైఎస్ వివేకానందరెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓడిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు.. జగన్ కూడా దానికి ఒప్పుకున్నట్లు గతంలో చర్చలు జరిపారు.. తన సోదరుడైన అవినాష్ రెడ్డిని తప్పించి వివేకాను కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావించినట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఎవరకు తెలియదు.. తన చిన్నాన్న పై మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది..ఈ విషయం వైఎస్ వివేకానందరెడ్డికి తెలిసి ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితుల్లో ఉన్నారట.. వివేకాను కడప ఎంపీగా బదులు మంత్రి ఆదినారాయరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జమ్మలమడుగు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారట జగన్. ఈ విషయాన్ని వివేకాకు నేరుగా చెప్పని జగన్… తన సన్నిహితుల దగ్గర ఈ వ్యాఖ్యలు చేశారట. ఈ విషయం ఆ నోట ఈ నోట వివేకాకు తెలియడంతో… ఆయనతో అసహనం పెరిగిపోయినట్టు తెలుస్తోంది.. తనకు గతంలోనే కడప ఎంపీ సీటుపై హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారని సమాచారం… ఇక రోజాకు కూడా ప్రశాంత్ కిశోర్ హెచ్చరికలు చేసినట్టు వార్తలు గతంలో వచ్చాయి. దీంతోనే ఆమె నోటీకి తాళం కూడా పడిందనే వాదనలు కూడా ఉన్నాయి.ఇక తన మన అని చూసుకుంటే రాజకీయాలు చేయలేమని గెలుపు గుర్రాలనే పోటీలో నిలపాలని చూస్తున్నట్లు ఆయన సన్నిహితులతో చెప్పుకొచ్చారట. లండన్ నుంచి రాగానే జగన్ వైఖరిలో పూర్తి స్థాయి మార్పులు కనిపించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.. మొత్తానికి ముందుగా బాబాయ్ నే పక్కనపెట్టడంతో కొంత అటూ ఇటూగా ఉన్న నేతలు కూడా ఆందోళనలో పడ్డారట..
Tags : ap political news, ap politics, Avinash Reddy, b tech ravi, Latest News, Latest Updates, MLA Roja, newsmarg, Political News, Political Updates, prashanth kishor warns ycp mla roja, telugu news, YCP, YS Jagan, ys jagan decision on ys vivekananda reddy, YS Jagan Mohan Reddy, YS Jagan UPSETS his FAMILY Members?, ys vivekananda reddy, ys vivekananda reddy to nominate as kadapa mp, YSRCP, బాబాయ్ కి ఝలక్ ఇస్తున్న అబ్బాయ్ కారణం ఇదే!