సోషల్ మీడియా లో రెచ్చిపోతున్న రోజా! | YSRCP MLA Roja Fires On Chandrababu Naidu | YCP

admin
roja

AP Chief Minister Chandrababu, speaking in the words of Amravati, says that the words in the subject matter are beyond the fortifications, but the only thing that matters is that the subject matter is accelerating, click on the below video to know more details of YSRCP MLA Roja Fires On Chandrababu Naidu | YCP

అమరావతి అంటూ ప్రపంచస్థాయి మాటలు చెప్పే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాని విషయం లో మాటలు మాత్రం కోటలు దాటిస్తున్నా డిజైన్ ల విషయం లో మాత్రమే విషయం వేగవంతం అవుతోంది తప్ప విషయం ఉండడం లేదు అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి.

ఆర్కిటెక్ సంస్థ లు , శంకుస్థాపన లూ ఇలా కలల రాజధాని విషయం లో అమరావతి కోసం ఒక్కటంటే ఒక్క ముందు అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు కనపడ్డం లేదు. ప్రధాన భవంతుల డిజైన్ ల విషయం లో ఎలాంటి స్పష్టత వస్తుందో రాదో కూడా తెలీని పరిస్థితి నడుస్తోంది. ప్రజలకి అమరావతి మీద అర్ధం లేని భ్రమలు కల్పిస్తున్నారు అనే విమర్శలు గట్టిగానే వినపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి లో ఎమ్మెల్యే రోజా చంద్రబాబు ప్రవర్తన పట్ల ఘాటు విమర్శలు చేసారు. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ గా చంద్రబాబు ని దుక్కి దున్నేసే రోజా మళ్ళీ ఒకసారి ఆయన మీద సీరియస్ అయ్యారు.

రాజధాని లో అత్యంత ముఖ్యమైన భవనాల నిర్మాణానానికి సంబందించిన డిజైన్ ల మీద ఇప్పటికీ ఇంకా ఆయనకి స్పష్టత రాకపోవడం మీద ప్రభుత్వానికి విమర్శలు వస్తున్నాయి అనీ అయినా వారు స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు అనేది ఆమె మాట. సోషల్ మీడియా వేదిక గా ఆమె చంద్రబాబు ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా లో ఈ మధ్య కాలం లో విపరీతంగా యాక్టివ్ ఉంటున్న ఆమె అమరావతి నిర్మాణం గురించి ఓపెన్ అయిపోయారు. పూటకొక మాట – రోజుకో మీటింగ్ – వారానికో కొత్త డిజైన్ – పక్షానికో విదేశీ యాత్ర – నెలకో తాత్కాలిక భవనానికి శంకుస్థాపన అంటూ సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ఇక తడకులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలను విరమించుకోవాలని – చిత్తూరు జిల్లాకు పుత్తూరు ఏమన్నా డంపింగ్ యార్డా అని రోజా ప్రశ్నించారు. ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వేస్ట్ ఎనర్జీ ఒక విఫల ప్రయోగమన్నారు. విజయవాడలో ఈ ప్రయోగం విఫలమైందన్నారు.

Tags : , , , , , , , , , , , , , , , ,