“జగనన్న బాణం” త్వరలో ప్రజల్లోకి! | YSRCP | YS Jagan To Bring YS Sharmila Back into Action

admin
jagan

Jagan Mohan Reddy, who is trying to fill a new Josh in the lapse of Nandyala and Kakinada, has begun efforts to turn his arrow back on? Did YS Jagan get ready for his sister Sharmis in the party soon? These questions are heard from the ycp arrays.click on the below video to know more details of YSRCP | YS Jagan To Bring YS Sharmila Back into Action

నంద్యాల, కాకినాడ వరుస ఓటములతో నీరసపడ్డ వైసీపీలో కొత్త జోష్ ను నింపేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనికోసం మళ్లీ తన బాణాన్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? త్వరలోనే పార్టీలో తన సోదరి షర్మిలకు కీలకమైన పదవి ఇచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారా ? ఈ ప్రశ్నలకు ycp శ్రేణుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

నంద్యాల, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి… పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అని కొందరు సీనియర్ నేతలతో సమవేసమయ్యి సలహాలు కోరారట. ఈ సమావేశంలో చాలామంది నాయకులు పార్టీలో షర్మిల క్రీయాశీలకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారని సమాచారం. ఎక్కువమంది నాయకులు ఇలా చెప్పడంతో జగన్ కూడా ఇందుకు సమ్మతించినట్టుగా తెలుస్తోంది.
అయితే పార్టీలో షర్మిలకు ఏ పదవి ఇస్తారనే దానిపై జగన్ క్లారిటీ ఇవ్వకపోయినా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించే అవకాశం ఉందని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు. కాని పలువురు నాయకులు షర్మిల విషయంలో జగన్ ఎన్నిసార్లు చెప్పినా తమ మాట వినడం లేదని… కాబట్టి ఈ సారి కూడా ఆయన ఏదో తల ఊపి ఊరుకుంటారని భావిస్తున్నారు. షర్మిలకు పార్టీలో కీలకమైన పదవి ఇస్తే ఆమె తనకు పోటీ అవుతుందని తనకంటే ఆమెకే జనంలో ఎక్కువ పాపులారిటీ ఉందని జగన్ అసూయ చెందుతున్నాడని వైసీపీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి షర్మిలకు తన పార్టీలో జగన్ స్థానం కల్పిస్తారా లేక లైట్ తీసుకుంటారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

Tags : , , , , , , , , , , , , , , , , ,