జ‌గ‌న్ గెల‌పును బాబు ఆప‌లేరంటున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఎందుకో తెలుసా?

దేశంలో రాజ‌కీయాల సంగ‌తి ఎలా ఉన్న ఏపీ రాజ‌కీయాల‌పై మాత్రం అన్ని వ‌ర్గాలకు ఆస‌క్తి పెరిగింద‌ని మాత్రం చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఏపీలో నెల‌కున్న ప్ర‌త్యేక ప‌రిస్థితి కార‌ణంలో ప్ర‌పంచ‌లో తెలుగువారు ఎక్క‌డ ఉన్నా ఏపీలో ఏం జ‌రుగుతుందో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌టానికి ఆస‌క్తి చూపుతున్నారు. దాంతో రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇత‌ర వ‌ర్గాలు కూడా రాజ‌కీయ పార్టీల గెల‌పు ఓట‌ముల‌పై ఎప్ప‌టికప్పుడు వారి అంచ‌నాల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. తాజాగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు న‌డుంప‌ల్లి సీతారామ‌రాజు మ‌రో రాజ‌కీయ విశ్లేష‌కుడు తెల‌క‌ప‌ల్లి ర‌వి చేసిన‌ ఇంట‌ర్వూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వివ‌రాల కోసం మీరు ఈ వీడియోను సాంతం చూడండి.

ఒక వెబ్ సైట్ కోసం ర‌వి సీతారామారాజును ఇంట‌ర్వూ చేస్తూ ఏపీలో రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి. ఎలా ఉంది? వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌నుకుంటున్నారు. అంద‌రితో ప‌రిచ‌యాలు ఉన్నాయి కాబ‌ట్టి ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితి, ఎన్నిక‌ల‌పై మీ అంచ‌న ఏమిటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సీతారామ‌రాజు సమాధానం చెబుతూ ఏపీలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. దాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబునాయుడు యూట‌ర్న్ . జిమ్మిక్కులు చేప‌ట్టారు త‌ప్పా లేక‌పోతే ఇలా చేసే అవ‌కాశం కూడా లేద‌న్నారు బిజెపితో తెగ‌తెంపులు చేసుకుంటే ఎస్సీలు. మైనార్టీల దగ్గ‌ర అవుతార‌నే ఉద్దేశంలోనే మోదీ ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని విశ్లేసించారు. అంతే కాకుండా జ‌రిగిన లోపాల‌ను ఎలా స‌రిదిద్దాల‌నే అంశానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా లోకేష్‌ను ఎలా కాపాడుకోవాల‌నే తాప‌త్రాయం ఎక్కువుగా చంద్ర‌బాబులో క‌న్పిస్తుంద‌న్నారు. మ‌ధ్య‌లో ర‌వి జోక్యం చేసుకుంటే జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉందా? అని ప్ర‌శ్నిస్తే చాలా ఫేప‌వ‌ర్‌గా ఉంద‌ని ఆయ‌న స‌మాధానం చెప్పారు. కొంత వ్య‌వ‌ధి ఉంది కాబ‌ట్టి ట్రెండ్ మారుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు కాని ఒక‌సారి స్టాప్ ప‌డితే మ‌ళ్లీ రియ‌లైజ్ అయ్యే అవ‌కాశం లేద‌న్నారు. ఎన్టీఆర్ 1989లో ఓడిపోతార‌ని చెపితే రామారావు న‌మ్మ‌లేదు. కానీ ఆత‌ర్వాత పిలిచి బాధ‌ప‌డ్డార‌న్నారు. వ్యాపార వ‌ర్గాలు కూడా బాబు మోదీ పోవాల‌ని కోరుకుంటున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే వాళ్లు ఎవ‌రు రావాల‌ని విష‌యంపై వాళ్లు ఏమీ చెప్ప‌లేద‌న్నారు. దీనితో ఇప్పుడు వైసిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. పార్టీ శ్రేణుల నుంచే కాకుండా త‌ట‌స్టులు. ఎప్పుడు ప్ర‌జ‌ల ప‌క్షంగా ఆలోచించే వాళ్లు కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు. ఈ ప‌రిణామాలు వైసిపికి బాగా సానుకూలంగా మారే అవ‌కాశాలు స్ప‌ష్టంగా ఉండ‌టంతో ఇప్పుడు వైసిపి శ్రేణుల్లో జోష్ క‌న్పిస్తుంది.

Add your comment

Your email address will not be published.