వైసీపీ అధికారంలోకి వ‌స్తాంది జ‌గ‌న్ ధీమా..కార‌ణాలేమిటో తెలిసా?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట క‌రుకుతేలింది. ఆత్మ‌విశ్వాత ఆయ‌న మాట‌ల్లో తొణికిసాలాడుతుంది. మాట‌లోనూ. న‌డ‌తలోనూ గ‌తానికి భిన్నంగా ఆయ‌న వ్య‌వ‌హార స‌ర‌ళి ఉంద‌ని ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తున్న వారు చెబుతున్నారు. ఆయ‌న‌లో మార్పు రావ‌టానికి కార‌ణాలేమిటి? గెలుపుపై ఆయ‌న అంత ధీమా వ్య‌క్తం చేయ‌టానికి ఆయ‌న‌లో అంత‌గా న‌మ్మ‌కం క‌ల్గించిన అంశాలేమిటి?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గ‌త 9 నెల‌లుగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను సాగిస్తున్నారు. ఏపీ చ‌రిత్ర‌లోనే ఇంత సుదీర్ఘంగా సాగిన పాద యాత్ర మ‌రొక‌టి లేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇంత సుదీర్ఘంగా జ‌గ‌న్ చేప‌ట్టిన యాత్ర మ‌రో కొంత కాలం సాగ‌నుంది. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 జిల్లాలు పూర్తి చేసుకుని విశాక‌ప‌ట్నం జిల్లాలో అడుగు పెట్టారు. ఇవి కాక మ‌రో రెండు జిల్లాల్లో జ‌గ‌న్ పాద యాత్ర సాగుతుంది. దాదాపు మ‌రో నెల ప‌దిహేను రోజుల పాటు ఆ యాత్ర సాగుతుంద‌ని భావించ‌వ‌చ్చు. దాదాపు ఏడాది పాటు పాద‌యాత్ర సాగించిన‌ట్లే అవుతుంది. ఇది ఉంటే జ‌గ‌న్ పాద యాత్ర మొద‌లు పెట్ట‌క ముందు నిర్వ‌హించిన పార్టీ ప్లీన‌రీలో రూపొందిన న‌వ‌ర‌త్న‌లు పేరుతో వైసిపి ప్ర‌క‌టించిన ప్ర‌జాక‌ర్ష‌ణ ప‌థ‌కాలను జ‌గ‌న్ పాద యాత్రలో ప్ర‌ధానంగా ప్ర‌చారం చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు అంటూ వ‌చ్చాయి. కానీ గ‌డ‌చిన పాద‌యాత్ర‌ను ప‌రిశీలిస్తే జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో మ‌మేకం కావ‌టంతో పాటు వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌టం. ఆయ‌న ప‌రిధిలో ఉన్న స‌మ‌స్య ప‌రిష్కారికి త‌న వంతు కృషి చేస్తూ సాగుతూ వెళ్తున్నారు. భారీ ఎత్తున జ‌రుగుతున్న బ‌హిరంగ స‌భ‌ల్లో ఉప‌న్యాసాలు చేస్తున్నారు.

స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తున్నారు. ఆ జ‌నాన్ని చూస్తే జ‌గ‌న్ ఎలా ఫీల‌వుతున్నారో ఏమో కానీ స‌గ‌టు ప‌రిశీల‌కుడు మాత్రం ఆశ్య‌ర్య‌పోతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. జ‌గ‌న్‌కు ప్ర‌జాక్షేత్రం నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ కానీయండి. లేదా క‌ళ్లేదుట క‌న్పిస్తున్న చంద్ర‌బాబు నాయుడు వైఫ‌ల్యాలు కావ‌చ్చు. ఏపీలో మ‌రో నేత ఎవ‌రూ జ‌గ‌న్ కు ధీటుగా ప్ర‌జా క్షేత్రంలో ఉండి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌టం వంటి కార‌ణాలు ఒక ఎత్తు ఐతే గ‌త ఎన్నిక‌లతో పోలిస్తే జ‌గ‌న్ చాలా విష‌యాల్లో ప‌రిణ‌తి సాధించార‌నే అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి విన్పిస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు అంచుల దాక వ‌చ్చిన వైసిపి కొన్ని లోపాలు కార‌ణంగా అధికారాన్ని అందుకోలేక‌పోయింద‌నే గుణ పాఠం ఆ పార్టీ తీసుకుందంటున్నారు. జ‌గ‌న్ వైపు నుంచి కూడా కొన్ని లోపాలు జ‌రిగి ఉండ‌వ‌చ్చు. అనే ఆత్మ విమ‌ర్శానా ధోర‌ణిలో జ‌గ‌న్ బ‌హిరంగంగా అంగీక‌రించ‌టం పార్టీశ్రేణులకు జ‌గ‌న్ పై గురి కుద‌ర‌టానికి దోహ‌దం చేసిందంటున్నారు. అధినేత జ‌రిగిన లోపాన్ని గుర్తి స‌రి చేసుకునే ధోర‌ణి లేక‌పోతే ఆ పార్టీని ఎవ‌రూ ర‌క్షించ‌లేరు. దానికి భిన్నంగా ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిస్థితి బేరీజు వేసుకుంటూ త‌ప్పుల‌ను అధిక‌మిస్తూ అంద‌రితో క‌లుస్తూ అంద‌ర్ని క‌లుపుకునిపోతే ఆ పార్టీకి భ‌విష్య‌త్ త‌ప్ప‌క ఉంటుందని గ‌త అనుభ‌వాలు రుజువు చేస్తున్నాయి. జ‌గ‌న్ వైఖ‌రి పార్టీలోనూ. కేడ‌ర్‌లోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది. గ‌తంలో జ‌గ‌న్ పై జ‌రిగిన ప్ర‌చార ప్ర‌భావం కార‌ణంగా అనేక ర‌కాల ప్ర‌చారాలు సాగాయి. దాంతో చాలా మందిలో అనేక ర‌కాలు అభిప్రాయా లు గూడుక‌ట్టుకున్నాయి. జ‌గ‌న్ తీరుతో ఇవ్నీ ప‌ఠ‌పంచ‌లైపోతున్నాయి. జ‌గ‌న్‌లో నూ కేడ‌ర్‌పై విశ్వాసం క‌లుగుతుంది. ప్ర‌జ‌ల బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నా ఆ ప‌రిస్థితిని ఉప‌యోగించుకునే కేడ‌ర్ ఉండాలి. వైసిపి గ‌త కొంత కాలంగా బూత్ స్ధాయిలో ఈ కృషి చేస్తోందంటున్నారు. ఇట‌న్నింటితో పాటు గ‌త ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితికి పూర్తి భిన్నంగా ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఉన్నాయి. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌టానికి చంద్ర‌బాబు వేస్తున్న ఎత్తుగ‌డ‌లను సోష‌ల్ మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌డుతుంది. అదే టైంలో బాబు వైఫ‌ల్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అవ‌న్నీ బాబు అక్కౌంట్‌లో చేరి విప‌క్షానికి అనుకూలంగా మారే ప‌రిస్థితి నెల‌కుంది. అంతే కాకుండా ఏపీలో ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఒంట‌రిగా మిలిగిపోయాడు. ఏపీలో నెల‌కున్న ప్ర‌త్యేక ప‌రిస్థితిలో బాబు కాంగ్రెస్ జ‌త‌క‌ట్టినా అది బాబ‌కు క‌లిసి వ‌చ్చే అంశం కాదు. కాంగ్రెస్‌ను నిజంగా అభిమానించే వాళ్లు టిడిపి ఏపీలో టిడిపి ఓటు వేస్తార‌ని గ్యారంటీ లేదంటున్నారు. దానికి తోడు టిడిపి ఆవిర్బారం నుంని నేటి వ‌ర‌కు టిడిపి ఒంట‌రిగా పోటీ చేసి గెలిచిన చ‌రిత్ర‌లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త బాగా పెరిగిందంటున్నారు. దీన్ని గ‌మ‌నించిన బాబు హోదా వంటి అంశాల్లో యూట‌ర్న్ తీసుకున్నా ప్ర‌జ‌లు బాబు మ‌రో న‌మ్ముతారా? అనేది ప్ర‌శ్నార్ద‌క‌మే. అనుభ‌వం ఉన్న నేత‌గా గుర్తించి బాబును గెలిస్తే బాబు త‌న అనుభ‌వంతో అవినీతి కొంత పుంత‌లు తొక్కించారు త‌ప్పా. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా పాల‌న సాగించ‌లేక‌పోయార‌నే అప్ర‌ధ‌ను బాబు మూట‌గ‌ట్టుకున్నారు. అమ‌రావ‌తి ఇంకా డిజైన్ల స్ధాయి దాట‌లేదు. ఏపీలో నెల‌కున్న రాజ‌కీయ ప‌రిస్ధితిలో రెండు పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డే ప‌రిస్థితి ఉంది. ఈ ప‌రిణామ‌లు అన్నీ వైసీపికి సానుకూల సంకేతాలే ఇస్తున్నాయి. దానికి తోడు గ‌త ఎన్నిక‌ల్లో వైసిపి టిడిపి మ‌ధ్య ఓట్ల తేడా 5 ల‌క్ష‌ల ఓట్లే. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గ్యారంటీగా అధికారంలో వ‌స్తుంద‌నే భావ‌న జ‌గ‌న్ నుంచి వ్య‌క్తం అవుతుందంటున్నారు. ఆయ‌న టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వూలో ఇదే ధీమాను వ్య‌క్తం చేశారు.

Add your comment

Your email address will not be published.