సున్న‌పురాయి అక్ర‌మ ర‌వాణా కుంభ‌కోణం కంచికేనా?..18 ఏళ్ల లావాదేవిల‌పై విచార‌ణ దేనికి సంకేతం?

గుంటూరు జిల్లా జ‌రుగుతున్న సున్న‌పురాయి కుంభ‌కోణంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రో రాజ‌కీయ ఎత్తుగ‌డ వేస్తున్నారా? అని ప్ర‌శ్నించుకుంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గుంటూరు జిల్లా గురుజాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తి నేని శ్రీ‌నివాస‌రావు సాగిస్తున్న సున్న‌పురాయి అక్ర‌మ‌ర‌వాణాపై హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించ‌టంతో ప్ర‌భుత్వం లో క‌ద‌లిక వ‌చ్చింది. కానీ వ‌చ్చిన క‌ద‌లిక సున్న‌పురాయి కుంభ‌కోణాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేదిగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తున్నాయి.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌త‌నేని శ్రీ‌నివాస‌రావు సున్న‌పురాయిని అక్ర‌మ ర‌వాణా చేస్తూ కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం దీనిపై స్పందించ‌లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే నేరుగా వ్య‌వ‌హారాలు స‌క్క‌బెడ‌ట్ట‌డంతో అధికారులెవ‌రూ అక్ర‌మ ర‌వాణాను నియంత్రించే ధైర్యం చేయ‌లేదు. దీంతో హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టు విచారించి అక్ర‌మ ర‌వాణాను నియంత్రించాల‌ని ఆదేశిచింది. కానీ కోర్టు మాట‌ను కూడా అధికారులు ప‌ట్టించుకోలేదు. పైగా కోర్టు తీర్పు ఇచ్చినా కూడా సున్న‌పురాయి ర‌వాణా ఇంకా కొన‌సాగుతూనే ఉంది.దీంతో హైకోర్టు మ‌రింత సీరియ‌స్ అయింది. ప్ర‌భుత్వం యంత్రాంగంపై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భుత్వ ధ‌నం ఇలా దుర్వినియోగం అవుతుంటే అధికార‌లు ఏం చేస్తున్నారు? అని నిల‌దీసింది.దీనిపై వివ‌రాలు కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం నేతృత్వంలో ప‌ని చేసే సిబిసిఐడి రంగ ప్ర‌వేశం చేసింది. ఇప్ప‌టికే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు అనాధికార పోలీస్ మంత్రిగా వ్య‌వ‌హారిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇటువంటి ప‌రిస్థితిలో పోలీసులు 18 ఏళ్ల నాటి సున్న‌పురాయి లావాదేవీల‌ను విచారించ‌టానికి రంగం సిద్దం చేశార‌నే వార్త‌ల‌పై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌రుగుతున్న అక్ర‌మ ర‌వాణ‌ను అడ్డుకుని కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌కు తీయాల్సిన స‌మ‌యంలో 18 ఏళ్ల నాటి లావాదేవీల‌ను కెల‌క‌టం వెనుక ప్ర‌భుత్వ కుట్ర ఉంద‌నే విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి. ఈ కేసును ప‌క్క‌దారి ప‌ట్టించ‌టంలో భాగంగానే ఇదంతా జ‌రుగుతుంద‌ని ఆరోప‌ణ‌లు విన్పిస్తున్నాయి. ప్ర‌భుత్వం 18 ఏళ్ల నుంచి లావాదేవీలు ఎందుకు విచార‌ణ‌కు పూనుకుందో ప్ర‌జ‌లకు చెప్పాలి.

Add your comment

Your email address will not be published.