జ‌గ‌ప‌తిబాబు పొలిటిక‌ల్ ఎంట్రీ?

జ‌గ్గూభాయ్‌తో తేదేపా రేప‌ల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ భేటీ అవ్వ‌డం హాట్ టాపిక్‌. జ‌గ‌ప‌తి పొలిటిక‌ల్ ఎంట్రీ కోస‌మే ఈ భేటీనా?

ప్ర‌ముఖ సినీన‌టుడు జ‌గ‌ప‌తిబాబు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఆ మేర‌కు జ‌గ్గూభాయ్‌తో తేదేపా రేప‌ల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ భేటీ అయ్యార‌ని తెలిసింది. కృష్ణా జిల్లా లో ఓ షూటింగ్ ప‌నిమీద వెళ్లిన జ‌గ‌ప‌తిని తేదేపా ఎమ్మెల్యే క‌ల‌వ‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. అన‌గాని – జ‌గ‌ప‌తిబాబు మీటింగ్ ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్‌. ఇరువురి మ‌ధ్యా రెండు గంటలకు పైగా చర్చలు సాగాయి. అయితే ఇది జ‌గ‌ప‌తిబాబు పొలిటిక‌ల్ ఎంట్రీకి సంబంధించిన‌దే అయ్యి ఉంటుంద‌ని ఊహాగానాలు సాగిస్తున్నారు. స‌డెన్ భేటీ ప‌లు సందేహాల‌కు తావిస్తోందంటూ సామాజిక మాధ్య‌మాల్లో ఇప్ప‌టికే డిష్క‌స‌న్ మొద‌లైంది. అయితే ఈ భేటీ కేవ‌లం స్నేహ‌పూర్వ‌క‌మే, రాజ‌కీయ ప్రాధాన్య‌త లేదంటూ జ‌గ‌ప‌తిబాబు చెబుతుండ‌డం విశేషం. 

Add your comment

Your email address will not be published.