20-20 సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌కు నిరాశే

mohanrao
cricket

భారత్, ఇంగ్లండ్ పోరులో భారత్ తన ఆఖరి పంచ్‌ను ఇంగ్లాండ్‌పై గట్టిగానే విసిరింది.

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో తన తడాఖాను ఇంగ్లండ్‌కూ గట్టిగానే రుచి చూపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడి రెండో మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా చివరి మ్యాచ్‌తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. గత టి20 మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన భారత్.. కొండంత ఆశతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగి పరుగుల మోత మోగించింది. భారత్ పర్యటనను విజయంతో ముగించి ఇంటికి వెళ్లాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధ వారం ఇక్కడ బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టి20 మ్యాచ్‌లో భారత్ పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఇప్పటికే సిరీస్‌లో రెండు జట్లు 1-1 తో సమానంగా ఉండగా, ఆఖరి మ్యాచ్‌లో భారత్ 2-1తో తొలి సిరీ స్‌ను కైవసం చేసుకుంది ఆటగాళ్లు అద్భు తమైన ప్రదర్శనతో చెలరేగిపోయారు. తొలుత టాస్ ఓడి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ విజయలక్ష్యాన్ని ముందు ఉంచింది. విజయ లక్ష్య సాధ‌న‌లో ఇంగ్లండ్ చ‌తికిల ప‌డి చేతులెత్తేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్టోక్స్ (6), అలి (2) పరుగులు చేయగా, రషీద్ (నాటౌట్), బట్లర్, ప్లంకెట్, జోర్డాన్, బిల్లింగ్స్ పరుగులు ఏమి చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. భారత్ బౌలర్లు వైఎస్ చాహల్ ఏకంగా 6 వికెట్లు తీసుకోగా, బుమ్రా 3 వికెట్లు, మిశ్రా ఒక వికెట్ తీసుకున్నాడు.

Tags : , , , , , , , ,