ఒక్క ప‌రుగులో డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

mohanrao
cricket

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ దీటు గా బదులిస్తోంది. 310 బం తుల్లో 199 చేసిన క‌ర్నాట‌క కుర్రోడు రాహుల్ ఒక ప‌రుగ‌లో డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయ్యాడు.

మూడో రోజు ఆదివారం ఓవర్ నైట్ స్కో రు 60తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. ఈ క్రమంలో కెఎల్ రాహుల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, కొద్దిసేపటికే పార్థీవ్ (71) అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. వీరిద్దరూ కలిసి 152 పరుగుల విలువైన భాగ స్వామ్యం నమోదు చేశారు. అయితే టీమిండియా ఓపెనర్లు సెంచరీకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 31 ఇన్నింగ్స్‌ల తరువాత ఇదే తొలిసారి.

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల వ్యక్తిగత స్కోరు ను చేరుకోగానే చెన్నైలో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసి న భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 1964లో బీకే కుందేరేన్ (192) పేరిట ఉంది. అంటే 52 ఏళ్ల తర్వాత రాహుల్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌పై ఓవరాల్ గా అత్యధిక వ్యక్తిగత పరుగుల ఓపెనింగ్ రికార్డు మాజీ ఆట గాడు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1979లో ఓవల్‌లో గ వాస్కర్ (221) ఓపెనర్‌గా ఈ స్కోరు సాధించాడు. అయితే రాహుల్ (199) త్రుటిలో డబుల్ సెంచరీ అవకాశాన్ని కోల్పో యాడు. దీంతో గవాస్కర్ రికార్డుకు 22 పరుగుల దూరంలో నిలిచాడు.

Tags : , , , , , ,