ఎమీ అందాల‌తో ఐపీఎల్ హీట్?

admin
Amy

ఓవైపు భానుడి తాపం, మ‌రోవైపు ఎమీ గ్లామ‌ర్ ఈ స‌మ్మ‌ర్‌ని మ‌రింత వేడెక్కించేయ‌బోతున్నాయి. అదెలాగో చ‌ద‌వండి మ‌రి!

ఎమీ జాక్స‌న్ అందాలు యువ‌త‌రంలో ఎప్పుడో వేడి పుట్టించాయి. `మ‌ద‌రాసిపట్ట‌ణం` సినిమా మొద‌లు, మొన్న‌టి `ఐ` సినిమా వ‌ర‌కూ ఎమీజాక్స‌న్ అంద‌చందాలు క‌న్నుల‌ పండువ చేశాయి. అయితే పండ‌గ అక్క‌డితో అయిపోలేదు. త్వ‌ర‌లో రిలీజ్ కి రాబోతున్న క్రేజీ మూవీ `2.ఓ` (రోబో-2)లోనూ ఎమీజాక్స‌న్ గ్లామ‌ర్ అద‌ర‌హో అన్న‌ట్టే ఉంటుందిట‌. ఈ చిత్రంలో ఎమీ గెట‌ప్పులు సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంటాయ‌ని డైరెక్ట‌ర్ శంక‌ర్ స్వ‌యంగా చెప్పారు. 

ఇక ఎమీ ట్యాలెంటు కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాలేదు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ హీట్ పెంచేయ‌బోతున్నాయ్. చీర్ లీడ‌ర్స్‌కే ఝ‌ల‌క్ ఇచ్చే రేంజులో ఎమీజాక్స‌న్ ఐపీఎల్ 2017 సీజ‌న్ హీట్ పెంచేస్తోంది. ఓ వైపు భానుడి తాపం, మ‌రోవైపు ఎమీ గ్లామ‌ర్ ఈ స‌మ్మ‌ర్‌ని మ‌రింత వేడెక్కించేయ‌బోతున్నాయి. నేడు హైద‌రాబాద్‌-రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం (ఉప్ప‌ల్‌)లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కొత్త సీజ‌న్ ప్రారంభోత్స‌వంలో ఎమీ కొన్ని బాలీవుడ్ పెప్పీ నంబ‌ర్స్‌కి స్టెప్పులేయ‌నుంది. మ‌రి ఈ లండ‌న్ బ్యూటీ డ్యాన్సుల్ని ఆస్వాధించేందుకు సిద్ధ‌మేనా?

Tags : , , , , , , , , ,