ఒలింపిక్ విన్న‌ర్ గిఫ్ట్‌ కారు ఎందుకు తిరిగిస్తోంది?

mohanrao
deepa

ఒలింపిక్స్‌లో భార‌త్ త‌ర‌పున ఆద్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసి ప‌రువు నిల‌బెట్టిన అమ్మాయిల్లో దీపా క‌ర్మాక‌ర్, పీవీ సింధూ, సాక్షి మాలిక్ అనే విష‌యం తెలిసిందే.

ఒలింపిక్స్‌లో వీరు సాధించిన ఘ‌న‌త‌ను గౌర‌విస్తూ స‌చిన్ టెండూల్క‌ర్ చేతుల మీదుగా బిఎండ‌బ్ల్యూ కార్ల‌ను వీరికి గిఫ్ట్ లుగా ఇచ్చారు. అయితే దీపాక‌ర్మాక‌ర్ మాత్రం త‌న‌కు గిఫ్ట్ గా వ‌చ్చిన కారును తిరిగి ఇచ్చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. కార‌ణం మ‌న‌కు విచిత్రంగా అన్పించ వ‌చ్చు. కానీ దీపా క‌ర్మాక‌ర్ తప్పని సరి పరిస్థితి. త‌న జ‌న్మ‌స్ధ‌లం అయిన ఆగ‌ర్త‌ల రోడ్ల‌పై కారు న‌డ‌ప‌టం అంటే బిఎం డబ్ల్యూ కారును పాడు చేయటమేనట. దాన్ని మెయింటెయిన్ చేయ‌టం సాధ్యం కావ‌టం లేద‌దని ఆమె వాపోతున్నారు. ఇక్క‌డ కారు న‌ప‌టం అంటే కార‌ను పాడు చేసుకోవ‌టమే అని భావిస్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని దీపా కోట్ బిశ్వేశ్వ‌ర్ నంది తెలిపారు. అన్నింటి కంటే అగ‌ర్త‌ల రోడ్ల ప‌రిస్థితిని ప్ర‌భుత్వానికి తెల‌ప‌డానికే దీపా క‌ర్మాక‌ర్ ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు. ఈ సంఘ‌ట‌న‌తోనైనా ఆగ‌ర్త‌ల రోడ్లు బాగుబ‌డితే దీపా ఆగ‌ర్త‌ల ప్ర‌జ‌లకు మేలు చేసిన‌ట్లే క‌దా?

Tags : , , , , , , , ,