ఐదు ప‌రుగుల తేడాతో ఓడిన భార‌త్

mohanrao
cricket

ఈడెన్‌గార్డెన్స్‌లో ఆదివారం చివరి వరకు ఉత్కంఠతతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లాండ్ తొలి విజయాన్ని సాధించింది.

చివరి వరకు భారత్ గెలుస్తుందన్న ఆశ కొనసాగినప్పటికీ చివరికి టీమిండియా ఉద్వేగభరిత పరాజయాన్ని చవిచూసింది. కేదార్ జాదవ్ 70 బంతుల్లో 90 పరుగులు చేసినా ఫలితం వృథా అయింది. చివరి ఓవర్లో ఇంకా 16 పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్నా భారత ఆశలు కొనసాగాయి. కానీ చివరికి ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బెన్ స్టోక్స్ నిలిచాడు.

ఇంగ్లాండ్ నిర్దేశించిన 322 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. భారత జట్టు స్కోరు 13 వద్ద ఉండగానే రహానే(1) వికెట్ కోల్పోయింది. అయినా భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో సిరీస్‌ను ఇదివరకే ఖాతాలో వేసుకుంది. దాంతో ఇంగ్లాండ్ జట్టుకు సిరీస్‌లో చివరికి కన్సోలేషన్(ఊరట) గెలుపు లభించినట్లయింది. నాలుగు బంతుల్లో భారత్ ఇంకా ఆరు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు సైతం ఇంగ్లాండ్ క్రికెటర్ల ముఖంలో ఓ నర్వస్‌నెస్ కనిపించింది. చివరి రెండు బంతులుండగానే కేదార్ ఔటయిపోయాడు.
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మరోసారి తమ సత్తా చాటుతూ మూడో వన్డేలోనూ మూడోసారి కూడా 300పైచిలుకు పరుగులు చేశారు. ఏడవ వికెట్ స్టాండ్‌లో బెన్‌స్టోక్స్, క్రిస్ వోక్స్ ద్వయం 40 బంతుల్లో 73 పరుగులు సాధించడం చెప్పుకోదగ్గ విషయం. వారికి ముందు జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోలు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పునాది వేశారు. భారత బౌలర్లు రాయ్, సామ్ బిల్లింగ్స్‌కు తమ బంతుల్తో చక్కటి పరీక్షనే పెట్టారు. దూకుడుగా ఆడే వారు అవకాశం కోసం కాచుకునేలా చేశారు. రాయ్ ఈ సిరీస్‌లో మూడో తన అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అతడు పుణెలో 73, కటక్‌లో 82, ఇక్కడ 56 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అతడు ఇంగ్లాండ్ జట్టు స్కోరును 350కిపైగా తీసుకెళతాడనుకున్న అభిమానులకు నిరాశనే మిగిల్చాడు. డ్రింక్స్ విరామసమయానికి ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కోల్పోకుండా 97 పరుగుల బలమైన స్థితిలో ఉండింది. అలెక్స్ హేల్స్ స్థానంలో మొదటిసారి ఆడిన బిల్లింగ్స్ బాగానే ఆడాడు. తన 35 స్కోరులో బిల్లింగ్స్ రవీంద్రజడేజా బంతిలో బుమ్రాకు క్యాచ్‌అవుట్ అయ్యాడు. మూడో వికెట్‌కు మోర్గాన్, బెయిర్‌స్టో కలసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నిలిపారు. స్టోక్స్ 39 బంతులాడి 57 పరుగులతో అజేయంగా నిలిచాడు

Tags : , , ,