తండ్రీకొడుకులు కలిసి ఒకే మ్యాచ్‌ ఆడిన అరుదైన దృశ్యం

admin
Tyagi-shiv

క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో తండ్రీకొడుకులు బరిలోకి దిగడమే అరుదు. ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు చేస్తే అది పెద్ద విశేషమే మరి.

అన్నదమ్ములు కలిసి ఒకే మ్యాచ్‌లో ఆడిన సందర్భాలు చాలానే చూసి ఉంటాం. కానీ తండ్రీ,కొడుకులు కలిసి ఒక అధికారిక క్రికెట్‌ మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగిన దాఖలాలు క్రికెట్‌ చరిత్రలో దాదాపుగా లేవనే చెప్పాలి. ఐతే వెస్టిండీస్‌ దేశవాళీ క్రికెట్లో ఈ అసాధారణ దృశ్యం చోటు చేసుకుంది. ఆ దేశ దిగ్గజ ఆటగాడు శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌.. తన కొడుకు త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌తో కలిసి కరీబియన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం విశేషం. వీళ్లిద్దరూ కలిసి గయానా తరఫున మ్యాచ్‌ ఆడారు.

జమైకాతో జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి బ్యాటింగ్‌ కూడా చేశారు. ఓపెనర్‌గా దిగిన త్యాగ్‌నారాయణ్‌ (58) పరుగులు చేస్తే.. ఐదో స్థానంలో వచ్చిన శివ్‌నారాయణ్‌ (57) పరుగులు సాధించాడు. వీళ్లిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యం కూడా నమోదు చేశారు. తండ్రీ,కొడుకులు కలిసి ఒకే మ్యాచ్‌ ఆడిన అరుదైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఈ మ్యాచ్‌ వీక్షకులు.

Tags : , , , , , , , , ,