ధోనీకి అస‌లు ప‌రీక్ష.. నేడు కివీస్ చివ‌రి మ్యాచ్‌

mohanrao
dhomi

ఇండియ‌న్ కెప్టెన్ ధోని నేడు ప‌రీక్ష అని చెప్పాలి. ఈ మ్యాచ్‌తో సిరీస్ గెలుపోట‌ములు తేలిపోతాయి. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన మ్యాచ్‌తో గ‌తంలో ధోని ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించారు.

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి నిర్ణయాత్మక ఐదో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ క్రికెట ర్లు నేడు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు జరుగనున్న మ్యాచ్ ఇరు జ‌ట్ల కు కీల‌క‌మే. ఇప్పటికే 2-2తో సిరీస్ లో సమానంగా ఉన్న రెండు జట్లలో ఎవరు సిరీ స్ కైవసం చేసుకోనున్నారన్నది అందరికీ అంతు పట్టని విషయంగా మారింది. టెస్టు మ్యాచ్‌ల్లో సునాయాసంగా కివీస్‌ను ఓడించి ఆధిక్య‌త‌ను చాటుకుంది. వ‌న్డే వ‌చ్చే వ‌ర‌కు కొంచెం త‌డ‌బ‌డింద‌నే చెప్పాలి. ఇప్పుడు ఇండియ‌న్ కెప్టెన్‌కు ఇది కీలంగా మార‌నుంది. మ్యాచ్ చేజారితే ధోని ఇమేజ్‌ను దెబ్బ‌తింటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉండ‌గా విశాఖను ‘కయాంత్’ తుఫాను శుక్రవారం నుంచి తాకొచ్చని వాతావ రణం శాఖ ప్రకటించిన నేపథ్యంలో అసలు మ్యాచ్ సజావుగా సాగనుందా అన్నది మరో ప్రశ్నార్థక విషయం. తాజాగా ఆ తుఫాను బల హీనపడి వాయుగుండంగా మారనుందని వార్త లు అందాయి. అయినా అనుమానాలు ఇంకా వీడలేదు. ఇదిలా ఉండగా కెప్టెన్ ధోని 4వ బ్యాట్స్‌మన్‌గానే క్రీజులోకి దిగి ఫినిషర్స్ రోల్ నెరవేర్చాలని మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూ లీ గట్టిగా వాదిస్తున్నారు. కాగా క్రికెట్ గేమ్‌లో మ్యాచ్ ఫినిషిర్‌గా బాధ్యతలు తీసుకో వడం కఠినమైన పనుల్లో ఒకటిగా ధోని పేర్కొ న్నాడు. లోయర్ ఆర్డర్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడే ఆటగాడ్ని అన్వేషించడం కూడా కష్టమేనన్నాడు. అస‌లు ప‌రీక్ష మాత్రం ధోనికే.

Tags : , , , , , , ,