చిత్తు చిత్తుగా ఓడిన భార‌త్‌

mohanrao
asu

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత పర్యటన కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియాకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది.

ఇప్పటికే పలు జట్లపై ఆధిపత్యం కనబర్చి సొంత గడ్డపై ఇక తమకు ఓటమన్నదే లేదని నిరూ పించుకున్న భారత్ జోరుకు కంగారులు కళ్లెం వేశారు. భారత జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, ఆరితేరిన బ్యాట్స్ మెన్లు ఉన్నా కూడా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కనీసం గౌరవప్రదమైన ప్రదర్శనతోనైనా ఆకట్టు కోలేక చివరికి చేతులేత్తేశారు. మొదటి నుంచి తమ వద్ద స్పిన్ మంత్రాన్నే జపిస్తూ వస్తున్న భారత్‌కు అదే స్పిన్ మంత్రాన్ని సంధించిన ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తొలి భాగంగా ఠహూం డు మ్యాచ్ ది. 1-0తో సాధించింది. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 143/4 తో శనివారం (మూడో రోజు) రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కంగారుల జట్టు 87 ఓవర్లలో 285 పరుగులు చేసి ఆలౌటైంది.

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత ప్రద ర్శన (202 బంతుల్లో; 11 ఫోర్లు) 109 పరుగులు చేయడమే కాకుండా తోటి ఆటగాళ్లతో సమిష్టిగా రాణిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించి చక్కని స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధిం చిన 155 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం 441 పరు గుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది.

Tags : , , , , ,