పాక్ ను ఓడించి భార‌త్ హాకీ జ‌ట్టూ

mohanrao
hockey

క్రికెట్‌, హాకీ జ‌ట్లు రెండూ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు గిఫ్ట్‌లు ఇచ్చారు. న్యూజిలాండ్‌ను ఓడించి క్రికెట్ టీమ్ సీరిస్‌ గెలుచుకోగా, హామీ టీయ్ పాక్‌ను ఓడించి ఆసియా క‌ప్ తెచ్చింది.

భారత హాకీ అభిమానులకు, భారత హాకీ జట్టు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీతో.. ఆసియా కప్ హాకీ ఛాంపియన్స్ టైటిల్‌ని గెలుచుకుంది. దీంతో దీపావళి సంబరాలకు తోడు హాకీలో భారత జట్టు ఘనవిజయం సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. 3-2 గోల్స్ తేడాతో దాయాది పాక్‌ను భారత్ చిత్తుచేసింది. తొలి రెండు గోల్స్ భారత జట్టు సాధించినప్పటికి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ప్రత్యర్థి జట్టు వరుసగా రెండు గోల్స్ చేసి స్కోర్ సమం చేసింది. అయితే ఆట 51వ నిమిషంలో భారత జట్టు గోల్ సాధించడంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక, ఆ తర్వాత భారత ఆటగాళ్లు పాక్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్ 3-2 గోల్స్ తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. కాగా, భారత్ ఈ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. టైటిల్ గెలిచిన భారత జట్టుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags : , , , ,