ఇంగ్లాండ్‌ సిరీస్‌ ముందు చేతులెత్తేసిన ఇండియా?

surendra a
bcci1

ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌కు ముందు బీసీసీఐ చేతులెత్తేసింది. ఆటగాళ్ల ఖర్చులు సొంతంగా భరించాలని ఈసీబీకి విజ్ఞప్తి

భారత పర్యటక జట్టు ఆటగాళ్ల ఖర్చులను సొంతంగా భరించాలని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ కార్యదర్శి అజయ్‌షిర్కే లేఖ రాశారు. ప్రస్తుతం తమ ఆర్థిక లావాదేవీలపై సుప్రీం కోర్టు ఆంక్షలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ విషయం తెలియజేసేందుకు ఎంతో బాధగా ఉందని లేఖలో క్షమాపణలు తెలిపారు. అయితే ఈ విషయంపై ఈసీబీ స్పందించింది. ‘కుక్‌’సేన ప్రస్తుతం ఉపఖండంలోనే ఉండడంతో తమ ప్రణాళికలో మార్పులు చేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపింది. టీమిండియాతో సిరీస్‌ ముందుకెళ్తుందని పేర్కొంది.

పర్యటక జట్టుకు అన్ని ఏర్పాట్లు, చెల్లింపులు ఆతిథ్య బోర్డే చేయాల్సి వుందని, తాము ఆర్థిక లావాదేవీలు జరపలేని స్థితిలో ఉన్నందున ఇంగ్లాండ్‌ జట్టు ఆటగాళ్ల ఖర్చులను భరించాలని ఈసీబీని తాము కోరవచ్చో? లేదో? చెప్పాలని షిర్కే, లోధా కమిటీని కోరిన సంగతి తెలిసిందే. ‘ఈసీబీ, బీసీసీఐ మధ్య అవగాహన ఒప్పందం ద్వైపాక్షిక క్రికెటింగ్‌ విధానానికి సంబంధించింది. అది మా పరిధిలోది కాదు. బీసీసీఐ నేరుగా చెల్లింపులు చేయాల్సి వస్తే దానికి సంబంధించిన వివరాలు సమర్పించే వరకు మేమెలాంటి ఆదేశాలు ఇవ్వలేం’ అని లోధా కమిటీ చెప్పింది. క్రికెట్‌ క్యాలండర్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని హితవు పలికింది.

Tags : , , , , , , , , ,