నేడు ఇరాన్‌తో త‌ల‌ప‌డ‌నున్న ఇండియా

mohanrao
kabaddi

ఊహించిన‌ట్లే ప్ర‌పంచ క‌బ‌డ్డీ సెమీ ఫైన‌ల్స్‌లో ఇండియా విజ‌యం సాధించింది. ఏక‌ప‌క్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో థాయిలాండ్ ను తుక్కు తుక్కుగా ఓడించింది.

క‌బడ్డీ ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా థాయిలాండ్‌తో శుక్ర‌వారం జరిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. నేడు అహ్మ‌దాబాద్‌లో ఇరాన్‌ను ఫైన‌ల్‌లో ఢీ కొట్ట‌బోతుంది. మొద‌టి మ్యాచ్ త‌ప్ప , ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇండియా విజ‌యం సాధించింది. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫేవ‌ర్‌గా ఇండియా బ‌రిలో దిగుతుంది. ఫైన‌ల్లో ఇండియా ప్ర‌త్య‌ర్ధి ఇరాన్ ఆడిన అన్న మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆత్మ విశ్వాసంతో ఉంది. కాబ‌ట్టి ఇరాన్‌ను ఎదుర్కొవ‌టం ఇండియాకు అంత సులువు కాద‌ని ఎక్స్‌ప‌ర్ట్ లు అంచ‌నా వేస్తున్నారు.

కొరియాతో త‌లప‌డిన ఇండియా తొలి మ్యాచ్‌లో కొంత అప్ర‌మ‌త్తంగా లేక‌పోవ‌టంతో ఓట‌మి స‌విచూసింది. తొలి మ్యాచ్ కాబ‌ట్టి స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉంది. కానీ ఇప్పుడు ఫైన‌ల్ కాబ‌ట్టి ఇండియా ఎటువంటి త‌ప్పుల‌కు అవ‌కాశం లేకుండా ఉంటేనే ఫైన‌ల్‌లో ఇరాన్ ను ఓడించి క‌బ‌డ్డీలో త‌న స్ధానాన్ని నిలుపుకుంటుందని ఆశిద్దాం.

Tags : , , , , , , , ,