విశాఖ టెస్టుల్లో భార‌త్ ఘ‌న విజ‌యం

mohanrao
india

భార‌త్‌కు విశాఖ‌ప‌ట్నం అచ్చొచ్చింది. టెస్టు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాక‌య‌త్వంలో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో 1-0 ఆధిక్యంలో భార‌త్ ఉంది.

ఒన్టే సిరీస్ కైవాసం చేసుకున్న భార‌త్ జ‌ట్లు ఆదే ఊపులో టెస్ట్ క్రికెట్‌లోనూ త‌న స‌త్తా చాటింది. తొలి టెస్ట్‌ను గెలుచుకోవ‌టం ద్వారా ఇండియా టెస్ట్ సిరీస్‌లోనూ పైచేయి సాధించింది. విరాట్ కోహ్లీ ఈ టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చ‌టం ద్వారా మ‌రో రికార్టు సొంతం చేసుకున్నాడు. డ‌బుల్ సెంచ‌రీలు న‌మోదు చేసిన ఇండియ‌న్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు, ఆయ‌న వ‌ర‌స‌గా డ‌బుల్ సెంచ‌రీలు చేసిన సంగ‌తి తెల్సిందే.

విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది. 405 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఏకంగా 246 పరుగుల భారీ తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. కాగా, భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ తలో మూడు వికెట్లు తీయగా, షమీ, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. రెండు ఇన్నింగ్స్‌లలో అద్భుత ఆటతీరు కనబర్చిన భారత కెప్టెన్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Tags : , , , , , , , , , ,