సిరీస్ గెలిచి దీపావ‌ళి కానుక ఇచ్చిన ధోని సేన‌

mohanrao
criket

టీమ్ ఇండియా వ‌న్డే సిరీస్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదు వ‌న్డేల సిరీస్‌ లో చివ‌రి మ్యాచ్‌ను గెలిచి దేశ ప్ర‌జల‌కు దీపావ‌ళి కానుకను ఇచ్చింది ఇండియ‌న్ టీమ్‌,

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. జరిగిన మ్యాచ్ ల్లో 2:2 నిలిచాయి. కాబట్టి చివరి వన్డే విజయం సాధిస్తే సిరీస్ సొంతం అవుతోంది. కీలకమైన ఈ వన్డేలో భారత్, న్యూజిలాండ్ ను ఓడించింది. స‌మిష్టి రాణింపుతో ఇండియా న్యూజిలాండ్‌పై 3:2 తో సిరీస్ కైవాసం చేసుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 70 ప‌రుగులు చేశారు. విరాట్ కోహ్లీ 65 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యారు. అప్ప‌టికే కొంత నెమ్మ‌దిగా ఆడుతున్న టీం ఇండియా ఇదే ఆట తీరును ప్ర‌ద‌ర్శించించింది. నిర్ణ‌త 50 ఓవ‌ర్లో 269 స్కోర్ చేసి న్యూజిలాండ్‌కు 270 టార్గెట్ ఇచ్చింది.

బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లో తీవ్ర‌మైన ఒత్తిడితో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టీమిండియా స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా దాటికి కుప్ప‌కూలిపోయారు. 18 ప‌రుగులిచ్చి ఐదు వికెట్లు తీయ‌టంతో న్యూజిలాండ్ ఇక కోలుకోలేదు. దీంతో కివీస్ 23.1 ఓవ‌ర్ల‌కు దుకాణం స‌ర్దేసింది. 79 ప‌రుగుల‌కే అలౌట్ అయింది. టెస్టు సిరీస్‌ను అంత‌కు ముందే గెలిచిన టీమిండియా వ‌న్డే సిరీస్‌ను గెలిచి క్రికెట్‌లో కివీప్‌పై పై చేయి సాధించింది.

.

Tags : , , , , , , , ,