మ్యాచ్‌ను గెలిపించిన బూమ్రా

mohanrao
cricket

రెండో మ్యాచ్ కూడా చేజారిపోతుందా? అనే ఆందోళ‌న‌తో టీవీల ముందు కూర్చున్న జ‌నానికి బౌల‌ర్ బూమ్రా మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించి ఊపిరి పూల్చుకునేలా చేశాడు.

చివరి బంతి వరకు ఉతంఠగా సాగిన భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌లో బూ మ్రా మ్యాజిక్‌తో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇం గ్లాండ్ జట్టు 139 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1 తేడాతో సమ మైంది. ఫిబ్రవరి 1న జరగబోయే ఆఖరి మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.

ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భు తంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతు ల్లో వికెట్లు తీశాడు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సిన సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 12 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌ను వేసిన బూమ్రా తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు

Tags : , , , , , ,