బంగ్లాతో టెస్టు మ్యాచ్‌లోనూ ఇండియా విజ‌యం

mohanrao
kohli

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి చవిచూసింది. వరస విజయాలతో కోహ్లీ సేన మంచి ఊపు మీద ఉంది.

బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌లో ఘన విజయంతో భారత్ జైత్రయాత్ర కొనసాగిం చింది. హైదరాబా ద్‌లో గెలుపుతో టీమిండియా వరుసగా 19వ మ్యాచ్‌లు నెగ్గినట్లయింది. ఐదోరోజు 103/3 తో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 250 పరుగులకు అలౌట్ అయింది. కనీసం డ్రా చేసేందుకు పోరాడిన ప్రత్యర్థి జట్టును భారత స్పిన్నర్లు అశ్విన్ (4/73), జడేజా (4/78) తేరుకొనివ్వలేదు. లంచ్ విరామానికి బంగ్లా స్కోరు 202/5 ఉండగా మహ్మదుల్లా (149 బంతుల్లో 64; షబ్బీర్ రహమాన్ (18) పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు.

225 పరుగుల వద్ద మహ్మదుల్లా అవుట్ కాగానే బంగ్లా పతనం మొదలైంది. ఆ తర్వాత కేవలం 8 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లను కోల్పోయింది. బంగ్లా ఆటగాళ్లలో సౌమ్య సర్కార్(42), మొహ్ముదుల్లా(64)లు రాణించగా, మొనిముల్ హక్(27), షకిబుల్ హసన్(22), ముష్ఫికర్ రహీమ్(23), షబ్బిర్ రెహ్మాన్(22), మెహిది హసన్ మిరాజ్(23)లు ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 204, రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగుల భారీ వ్యక్తిగత స్కోరుతో బంగ్లాదేశ్ బౌలర్లకు కోహ్లీ చుక్కలు చూపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Tags : , , , , , , ,