యూవీ, ధోనీ వీర‌బాదుడుతో సిరీస్ ఇండియాదే,

mohanrao
cricket

ప్రముఖ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ అద్భుతంగా చేసిన శతకాలతో కటక్‌లో భారత్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత్ జట్టు 15 పరుగుల తేడాతో రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై విజయం సాధిం చింది. యువరాజ్ స్ట్రోక్ ప్లే, పరు గుల వేగం గురించి వేరే చెప్పనవసరం లేదు. తన పాత రికార్డును కూడా అధిగ మించేశా లా చాలా దూకుడుగా ఆడాడు. బారాబతి స్టేడియం అంతా గురువారం ప్రేక్షకులతో కిక్కిరిసి పోయింది. రెండో వన్డేలో గురువారం టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టుకు వన్డే సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన స్థితి. ఇంగ్లాండ్ జట్టు రాచెల్ హేహో ఫ్లింట్ జ్ఞాపకార్థం నల్లని ఆర్మ్ బ్యాండ్లు ధరిచింది. భారత్ తరఫున బ్యాటింగ్‌కు శిఖర్ దావన్, లోకేశ్ రాహుల్ ఓపనర్లుగా క్రీజులోకి దిగారు. మొదటి 4.4 ఓవర్లలోనే 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను యువరాజ్ సింగ్, ధోనీ ఆదుకుని జట్టు స్కోరును భారీగా 381కి తీసుకెళ్ళారు. 2011 ప్రపంచ కప్‌లో ఆడిన వింటేజ్ జోడీ యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ నిలకడగా ఆడారు. బౌండరీలు, సిక్సర్లు బాది టాప్ లేపారు. యువరాజ్ సింగ్ అయితే ఇంగ్లాండ్ బౌలర్లు వేసే బంతులను చెండాడేశాడు. యువరా జ్ 126 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా యువరాజ్ సిం గ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌పై అత్యధిక వన్డే వ్యక్తిగత పరుగులు సాధిం చిన ఏకైక భారత్ క్రికెటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో యువరా జ్ తన 14వ శతకాన్ని నమోదు చేశాడు. బహుశా ఇదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్ అని యువరాజ్ ఈ సందర్భంగా పేర్కొ న్నాడు. ధోనీ సైతం 122 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ధోనీ 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఎంఎస్ ధోనీ 2013 త ర్వాత అంతర్జాతీయ వన్డేల్లో తన 10 శతకాన్ని నమోదు చేశా డు. యువరాజ్ సింగ్ 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాదారు. 40.5 ఓవర్లో యువరాజ్ సిం గ్ బ్యాటింగ్ చేస్తుండగా పెట్టుకు న్న రివ్యూను అంపైర్ ఎకె చౌదరి ఆమోదించాడు. నిర్ణీత 50 ఓవర్లలో కొహ్లి సేన 381 పరుగులు చేసి ఇంగ్లాండుకు 382 పరుగుల లక్షాన్ని ఉంచింది.

Tags : , , , , , , , , , , ,