టెస్ట్ క్రికెట్ ర్యాంక్స్‌లో రెండో స్ధానంలో విరాట్‌

mohanrao
virat

టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి రోజు రోజుకి కెరీర్‌లో ఎవ‌రూ ఊహించ‌నంత‌గా ఎదిగిపోతున్నాడు. తాజాగా టెస్టు క్రికెట్ ర్యాంకింగ్‌లో రెండో స్ధానానికి చేరుకున్నాడు.

ఇంటర్నెషనల్ క్రికెట్ కమిటీ(ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదే కోహ్లి కెరీర్ బెస్ట్ ర్యాంక్ కూడా. ముంబయి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో అద్భుతమైన డబూల్ సెంచరీ(235)తో ఆకట్టుకున్న కోహ్లికి 53 పాయింట్లు లభించడంతో మూడో స్థానం నుంచి రెండో స్థానాని(886 పాయింట్లతో)కి దూసుకెళ్లాడు.

ఇక రెండో స్థానంలో ఉన్నా జోయ్ రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. కాగా మొదటి స్థానంలో ఉన్నా ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ కోహ్లి కంటే కేవలం 11 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఐదో టెస్టులో కోహ్లి మరో అద్భుత ప్రదర్శన చేస్తే నెం.1గా నిలవడం ఖాయం. అలాగే భారత మరో బ్యాట్స్‌మెన్ పుజారా 756 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అశ్విన్ బౌలర్, ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్నాడు.

Tags : , , , , , , , ,