న‌న్ను సిక్స్‌ర్స్ కొట్ట‌కుండా ఎవ‌రూ ఆప‌లేరు

mohanrao
gayle

బౌలర్లు ఎన్నివిధాలా ప్రయత్నించినా తాను సిక్సర్లు కొట్టడాన్ని ఆపలేరని వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు.

చివరకు టూత్‌పిక్, ఫోర్క్, చిన్నకత్తి తో కూడా తనకు సిక్సర్ల కొట్టే సామర్థ్యం ఉందన్నాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్ క్రికెట్ కమిటీ (ఎంసిసి) బ్యాట్ సైజ్‌ను తగ్గించాలనే యోచనపై మాట్లాడిన గేల్ స్పందించాడు. తన వరకూ అయితే బ్యాట్ సైజ్‌తో అస్సలు ఇబ్బందేమీ లేదన్నాడు. వారు బ్యాట్ సైజ్ తగ్గించవచ్చు కానీ, తన సిక్సర్ల వర్షాన్ని కాదని గేల్ వ్యాఖ్యానించాడు. హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను గేల్ పంచుకున్నాడు. ప్రధానంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో విరాట్ సాధించిన డబుల్ సెంచరీ అతని అసాధారణ ప్రతిభకు అద్దం పడుతుందన్నాడు. విరాట్ తన కంటే గొప్పగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చాడు. తన కూతురు బ్లష్ తొలి క్రిస్ట్‌మస్ వేడుకల్ని జరుపుకుంటున్న కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బిబిఎల్) లీగ్ లో పాల్గొనడం లేదన్నాడు.

Tags : , , , , ,