మహిళా ప్రపంచ కప్ ప్రచారకర్త సచిన్

mohanrao
sachin

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసి) షెడ్యూల్ విడుదల చేసింది.

ఉమెన్స్ డే ను పురస్కరించుకుని లార్డ్స్‌ క్రికెట్ మైదానంలో మహిళల ప్రపంచకప్-2017 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ ప్రచారకర్తగా క్రికెట్ దేవుడు సచిన్ తెందుల్కర్‌ను నియామించినట్లు ఐసిసి నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి జూలై 23 వరకు మహిళా ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి.

జూలై 23న క్రికెట్ పుట్టిల్లు అయిన లార్డ్స్‌ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అలాగే జూన్ 24న భారత జట్టు, ఇంగ్లాండ్‌తో తలపడనుంది. గ్రూపు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఇవాల మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఐసిసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు.

Tags : , , , , , ,