ఈ ఏడాదీ సానియా ర్యాంక్ ప‌దిలం

mohanrao
sania

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ‌రుస‌గా రెండో ఏడాది కూడా మ‌హిళ‌ల డ‌బుల్స్ ర్యాకింగ్‌లో తొలి ర్యాంక్‌ను నిలుపుకున్నారు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వరుసగా రెండో సంవత్సరం కూడా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్టినా హింగిస్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ డబుల్స్ మహిళల టైటిల్‌ను సాధించిన సానియా మీర్జా బార్బరా స్ట్రయికోవాతో జతకట్టి సిన్‌సినాటీ మాస్టర్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో ఆమె నంబర్‌వన్ స్థానం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. మార్టినా హింగిస్‌తో కలిసి డబ్లుటిఎ ఫైనల్స్ సింగపూర్ టైటిల్‌ను చేజార్చుకున్నప్పటికీ, సానియా స్థానం మాత్రమే పదిలంగానే వుంది.

శనివారంనాడు డబ్లుటిఎ ఫైనల్స్ సింగపూర్ సెమీ ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ సానియా, హింగిస్‌లు ప్రత్యర్థులైన ఎకతెరీనా మకరోవా, ఎలీనా వెస్నినాల చేతిలో ఓడిపోయారు. ఫైనల్స్‌లో మకరోవా, వెస్నినాలు తమ ప్రత్యర్థులైన బెథానీ మాటెక్ శాండ్స్, లూసీ సఫరోవాలను ఓడించి టైటిల్ గెల్చుకున్నారు. దీంతో మాటెక్ శాండ్స్‌కు దక్కాల్సిన నెంబర్‌వన్ స్థానం మిస్సయింది. ఫలితంగా సానియా తన స్థానంలో నిలబడింది. “తిరిగి నెంబర్‌వన్‌గా నిలబడటం ఎంతో ఆనందంగా వుంది. రెండో ఏడాది కూడా నడవటం ఒక అద్భుతమైన ప్రయాణం” అని సానియా మీర్జా ఈ సందర్భంగా పేర్కొంది.

Tags : , , , , , , ,