సానియా మీర్జా జంట ఖాతాలో మ‌రో టైటిల్

mohanrao
tennnis

భార‌త టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-చెక్ రిప‌బ్లిక్ క్రీడాకారిణి బార్బ‌రాలు జోడీ టెన్నిస్ డ‌బుల్స్ లో మ‌రో సారి రాణించారు.

పాన్ పసిఫిక్ టోర్నమెంట్ ఫైన‌ల్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవా జోడీ విజ‌యం సాధించింది. దీంతో ఈ ఏడాది సానియా త‌న‌ ఖాతాలో ఎనిమిదో డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈరోజు జ‌రిగిన పోరులో చైనా టెన్నిస్ ప్లేయ‌ర్స్‌ చెన్ లియాంగ్-హవాన్ యంగ్ జోడీని 6-1, 6-1 తేడాతో మ‌ట్టి క‌రిపించింది.

మ్యాచ్ ఏక‌ప‌క్షంగా సాగింది. ఆట‌ప్రారంభం నుంచే ప్ర‌త్య‌ర్థి జోడీ పుంజుకునే అవ‌కాశాన్ని ఏ మాత్ర‌మూ ఇవ్వ‌ని సానియా జోడీ వరుస సెట్లను చేజిక్కించుకుంది. వీరిరువురూ గత నెల‌లో సిన్సినాటి ఓపెన్ టైటిల్ ను కూడా సాధించారు. గ‌త ఏడాది ఈ టోర్నీకి దూరంగా ఉన్న సానియా అంత‌కు ముందు జ‌రిగిన 2013, 14 పాన్ ఫసిఫిక్ టోర్నీల్లోనూ కారాబ్లేక్‌తో జోడీగా ఆడి టైటిల్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. 2015లో ఈ టోర్నికి సానియా మీర్జా దూరంగా ఉన్న విష‌యం తెల్సిందే.

 

Tags : , , , , ,