నెర‌వేరిన సింధు క‌ల

mohanrao
sindhu

చైనా ఓపెన్ సూప‌ర్ సిరిస్‌ను గెలిపొందిన సింధూ త‌న చిర‌కాల ఆకాంక్ష‌ను నెర‌వేర్చుకుంది.

బ్యాడ్మింటన్ లో చాలా కాలంగా ఆధిప్యం చాటుకుంటున్న చైనాలోనే ఆమె తకకన్నా ఒక ర్యాంకు మెరుగైన స్ధానంలో ఉన్న చైనా క్రీడాకా రిణి సన్ యూపై 21-11, 17-21, 21-11 తేడాతో గెలుపొందింది. ఒలింపిక్స్ రజత పతక విజేత పి.వి.సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను తన కెరీర్‌లో తొలిసారి గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

తొలి భారతీయ క్రీడాకా రిణిగా రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి న సింధు తన సత్తా ఏమిటో ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలిచి మరో సారి రుజువు చేసుకుంది. గంట తొమ్మిది నిమిషాల పాటు హోరాహోరి పోరాడి సింధు ఈ విజ యాన్ని సాధించింది. నూతనో త్తేజంతో ఆడి ఆధిక్యతను కనబరిచింది. శక్తివంతమైన రిటర్న్‌లతో సింధు చెలరేగి ఆడటంతో సన్ యూ ధీటుగా నిలబడలేకపో యింది. అంతేకాక ఆ చైనా క్రీడాకారిణి సరిగ్గా లిఫ్ట్ చేయలేక, వైడ్‌లు కొట్టి తప్పిదాలు చేస్తూపోయింది. ఆ తర్వాత సింధు షటిల్‌ను వెనుక నుంచి పుష్ చేయడంతో చైనా క్రీడాకారిణి దానిని ఆడలేక తడబడింది. అ తర్వాత సింధు పిడికిలి బిగించి విజ‌యాన్ని సొంత చేసుకుంది.

Tags : , , , ,