వీడియో : పాప కోసం ఆటను ఆపేశాడు..!

surendra a
for-chaild

చుట్టూ వందల మంది అభిమానులు, ప్రేక్షకులు మధ్య ఆసక్తికరంగా సాగుతున్న ఆటని ఉన్నట్టుండి స్పెయిన్‌ టెన్నిస్‌ ఆటగాడు ‘రఫెల్‌ నాదల్‌’ ఆటను ఆపేశాడు.

టెన్నిస్‌ ఆట జరుగుతుండగా ఓ పాప తప్పిపోవడంతో కూతురి కోసం ఏడుస్తూ వెతుకుతున్న తల్లి ఆయన కంట పడింది. ఆ సమయంలో నాదల్‌ స్పానిష్‌ ఆటగాడు సిమన్‌తో కలిసి ఆడుతున్న ‘డబుల్స్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌’లో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఓ మహిళ తప్పిపోయిన తన కూతుర్ని వెతుక్కుంటూ ఉండటాన్ని నాదల్‌ గమనించాడు. మ్యాచ్‌ను చూడటం ఆపేసి పాప కోసం అక్కడ ఉన్న వాళ్లంతా వెతకడం ప్రారంభించారు. “క్లారా.. క్లారా” అంటూ అక్కడ ఉన్న వాళ్లంతా తప్పిపోయిన చిన్నారి కోసం వెతుకుతుంటే కొద్ది దూరంలో ఏడుస్తూ పాప కనిపించింది.

వెంటనే తల్లి పాప క్లారా దగ్గరికి వెళ్లి తన చిన్నారిని హత్తుకుంది. మ్యాచ్‌కు కలిగిన అసౌకర్యానికి అందరికీ క్షమాపణలు చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాప తల్లి చెంతకు చేరిన తర్వాత యథా ప్రకారం నాదల్‌ తన ఆటను ప్రారంభించాడు.

Tags : , , , , , , , , , , , , ,