బీసీసీఐ కి సుప్రీం కోర్టు షాక్

mohanrao
anu

లోధాకమిటీ సిఫార్సులపై సుప్రీం కోర్టు ఆదేశాలు విషయంలో నిర్లక్షంగా వ్య‌వ‌హారించి నందుకు సుప్రీం బీసీసీఐ ఛైర్మ‌న్‌, సెక్ర‌ట‌రీల‌పై వేటు వేసింది.

లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీం ఆదేశాల అమలు విషయంలో నిర్లక్షంగా వ్యవహరించినందుకు గానూ బిసిసిఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్య క్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆయా పదవుల నుంచి తొలగిస్తూ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు వేటు వేసింది. ఈ మేరకు సోమవారం బిసిసిఐ కీలక పదవులనుంచి తొలగిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. బిసిసిఐ సభ్యుల ఎంపిక విషయంలో సూ చనలు ఇచ్చేందుకు సీనియర్ న్యాయవాదులైన ఫాలి ఎస్ నారా మన్, గోపాల్ సుబ్రమణ్యం లను సుప్రీం నియమించింది.

దేశంలో క్రికెట్ ప్రక్షాళన అమ లుపై లోధా కమిటీ గతంలో సమగ్ర నివేదకను సుప్రీంకు సమర్పించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లు పైబడిన రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు క్రికెట్ సంఘాల్లో ఎలాంటి పదవులు చేపట్టరాదని లోధా కమిటీ సూచించింది. కమిటీ నివేదికను స్పీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆయా సిఫార్సులను అమలు చేయాల్సిందేనని బిసిసిఐ బోర్డును ఆదేశించింది. కానీ, సుప్రీం ఆదేశాలను లెక్కచేయకుండా తమ ఇష్టానుసారంగా నియమకాలు చేపట్టింది బిసిసిఐ. లోధా కమిటీ సిఫార్సులను సీరియస్‌గా తీసుకోని ఠాకూర్, షిర్కేలు ప్రతిసారి ఏదో సమా ధానం చెబుతూ దాటవేయడం పరిపాటిగా మారింది. కోర్టు పదేపదే హెచ్చ రిస్తూ వస్తున్నా బిసిసిఐ ఏమాత్రం పట్టిం చుకోలేదు. దీంతో సుప్రీం కోర్టు చ‌ర్య‌కు పూనుకుంది.

Tags : , , , , , , , ,