ఇండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

mohanrao
cricket

చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 4-0 తేడాతో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ టీమిండియా విజయం సాధించింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ధాటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రీజ్ వద్ద నిలబడలేకపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆడక ముందే భారత్ 75 పరుగుల తేడా విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 4-0 తేడాతో భారత్ టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 1992 తర్వాత ఇంగ్లాండ్‌పై వరుసగా 2 టెస్టులో భారత్ విజయం సాధించడం ఇదే తొలిసారి.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 7 వికెట్ల నష్టానికి 759 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆది నుంచే బ్యాటింగ్‌లో తడబడింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ఒకొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. ఆల్ రౌండర్ జడేజా స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 207 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జెన్నింగ్స్ 54, కుక్ 49, అలీ 44, స్టోక్స్ 23 మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలింగ్‌లో జడేజా 7, ఉమేశ్, ఇషాంత్, మిశ్రా చెరో వికెట్ తీశారు.

Tags : , , , , , ,