కోహ్లికి టెస్టు ర్యాంకింగ్‌లో మూడో ర్యాంక్

mohanrao
kohli

ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మూడో ర్యాంక్ దక్కింది.

దీంతో కోహ్లి టెస్టు కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు కోహ్లి అద్భుత ఆటతీరుతో 405 పరుగులు చేశాడు. దీంతో నాల్గో ర్యాంక్‌లో ఉన్న కోహ్లి 833 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు.

కాగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్, ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కోహ్లి మిగతా రెండు టెస్టుల్లో రాణిస్తే నెం.1 ర్యాంక్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. భారత్ తరపున టాప్ 10లో పుజారా 8వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా నాల్గో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల విషయానికి వస్తే భారత మీడియం పేసర్ మహ్మద్ షమీ 21వ ర్యాంక్ నుంచి 19వ ర్యాంక్‌లో ఉన్నాడు

Tags : , , , , ,