ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కోసం భారత జట్టు ఎంపిక

surendra a
bharathteam

ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది.

విరాట్‌ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ ఆడిన గౌతమ్‌ గంభీర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈసారి జట్టు ఎంపికలో సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్‌ రౌండర్ హార్దిక్‌ పాండ్యా తొలిసారి టెస్ట్‌జట్టుకు ఎంపిక కావడం విశేషం. గాయం కారణంగా రోహిత్‌ శర్మ చోటు కోల్పోయాడు. రోహిత్ స్థానంలో కరుణ్ నాయర్‌కు సెలెక్టర్లు జట్టులో స్థానం కల్పించారు.

bcci

మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు వివరాలు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్), అజ్యింకా రహానె, ఇషాంత్‌ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్‌ గంభీర్‌, జయంత్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వర్దమాన్‌ సాహా(వికెట్ కీపర్), కరుణ్‌ నాయర్‌, మురళీ విజయ్‌, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య.

schedule

Tags : , , , , ,