చారిత్రక టెస్టు విజయం భారత్‌ దే..!

surendra a
500th

కాన్పూర్‌ చరిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ విరాట్ సేన, న్యూజిలాండ్‌పై మెమొరబుల్ విక్టరీ

కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చరిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ విరాట్ సేన ఘన విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. తొలుత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు చెలరేగడంతో 434 పరుగుల భారీ స్కోరుతో కివీస్‌కి భారత్‌ సవాల్‌ విసిరింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ డ్రా కోసం చివరి వరకు పోరాడినా, స్పిన్నర్‌ అశ్విన్‌ (132 పరుగులు; 6 వికెట్లు) ధాటికి నిలవలేకపోయింది.

ఉత్తమ ఆటతీరు కనబర్చిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 93/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 236 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో భారత్‌ కొనసాగుతోంది. మొత్తం మీద మొదటి టెస్ట్‌లో సమిష్టి కృషితో టీమిండియా కుర్రాళ్లు ఇరగదీశారు. రెండో టెస్టు శుక్రవారం నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఇన్నాళ్లు భారత్ శూరత్వం వన్డేల్లోనే అని విమర్శలు చేసిన వారికి విక్టరీతో సమాధానం చెప్పారు.
test1
test2

Tags : , , , , , , , , , , ,