ట్రిపుల్ సెంచ‌రీతో సెహ్వాగ్ ప‌క్క‌న‌ నిలిచిన క‌రుణ్ నాయ‌ర్‌

mohanrao
karun

డాషింగ్ బ్యాట్స్ మ్యాన్ తో తోడు దొరికాడు. 12 ఏళ్లగా ఒంటరిగా ఉన్న సెహ్వాగ్ కి తోడయ్యాడు.

చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 381 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. గత 12 ఏళ్లగా ఒంటిరిగా ఉన్న సెహ్వాగ్ సరసన నిలిచాడు.

అంతేగాక భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోర్ కావడం మరో విశేషం. ఇంతకుముందు చెపాక్ స్టేడియంలో భారత జట్టు చేసిన 726 పరుగులే ఇప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్. ఓవర్‌నైట్ స్కోర్ 391/4తో నాల్గో రోజు ఆట కొనసాగించిన భారత్ 759/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో ఆతిథ్య భారత్ 282 పరుగుల ఆధిక్యం సాధించింది.

Tags : , , , , , ,