4వ టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఘ‌న విజ‌యం

mohanrao
cricket

భార‌త్‌- ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇన్నింగ్స్‌, 36 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఇండియా చ‌రిత్రాక విజ‌యం న‌మోదు చేసింది.

వాంఖడే స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ నడ్డివిరిచాడు. ఐదో రోజు ఆట ప్రారంభంకాగానే అశ్విన్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆరు వికెట్లు తీయగా, జడేజా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, జయంత్ యాదవ్ చెరో వికెట్ పడ్డగొట్టారు. నాలుగో టెస్టులో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు

అంతకు ముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 631 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ 235, మురళీ విజయ్ 136, జయంత్ యాదవ్ 104 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో దోహద పడ్డారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆది నుంచే బ్యాటింగ్‌లో తడబడింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరిగా పెవిలియన్ బాటపట్టారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో రూట్ 77, బైస్టో 50 మినహా మిగితా వారందరూ స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. భారత బౌలింగ్‌లో అశ్విన్, జడేజా 2 వికెట్లు, యాదవ్, కుమార్ చెరో వికెట్ తీశారు.

Tags : , , , , , , , , , ,