ప్ర‌పంచ జూనియ‌ర్ హాకీ క‌ప్ విజేత‌లం మ‌న‌మే

mohanrao
ప్ర‌పంచ‌, జూనియ‌ర్, హాకీ క‌ప్‌, ఇండియా వ‌సం, world hockey cup winners , india

ప్ర‌పంచ జూనియ‌ర్ హాకీ క‌ప్‌ను మ‌రోసారి ఇండియా కైవాసం చేసుకుంది. జ‌ర్మ‌నీ త‌ర్వాత రెండోసారి ఈ క‌ప్‌ను సాధించిన దేశంగా ఇండియా నిలిచింది.

ప్ర‌పంచ జూనియ‌ర్ హాకీ క‌ప్‌ను ఇండియా సాధించింది. 15 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇండియా ఈ క‌ప్‌ను గెలిచి రికార్డు సృష్టించింది. 2001లో తొలిసారిగా జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను గెలిచిన భారత్ మరోసారి జూనియర్ హాకీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బెల్జి యంపై 2-1 గోల్స్ తేడాతో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో అతిథ్య జట్టు టైటిల్ గెలవడం ఇదే ప్రథమం. భారత జట్టు మ్యా చ్ గెలవగానే అటు క్రీడాకారులు, ఇటు హాకీ అభి మానులు ఆనందంలో మునిగితేలారు. హాకీ క్రీడా కారులపై భారీగా ఆశలు పెట్టుకున్న అభిమాను లు స్టేడియానికి తండోపతండాలుగా తరలివచ్చా రు. ప్రపంచకప్ గెలుపుతో అభిమానులు సంబు రాల్లో మునిగిపోయారు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత జట్టు తొలి అర్ధభాగం లోనే రెండు గోల్స్‌ను సాధించి సొంతగడ్డపై ప్ర పంచ కప్ కలను సాకారం చేసుకున్న హాకీ జట్టు ఎగిరిగంతేసింది

ఆట మొదలైన 8వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ బెల్జియం గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ మరుసటి నిమి షంలో నీలకంఠశర్మ గోల్ పోస్ట్‌కు బంతిని కొట్ట గా త్రుటిలో గోల్ చేజారింది. 22వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్, నీలకంఠ సమష్టిగా గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఆటముగిసే సరికి 2-1తో భారత్ రెండో పర్యా యం జూనియర్ హాకీ ప్రపంచ కప్‌ను కైవాసం చేసుకుంది.

Tags : , , , , ,